డ్యూడ్ మూవీకి తొలిరోజు ఏకంగా 14 కోట్లు.. ప్రదీప్ రంగనాథన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్.. ఆ 2 సినిమాల రికార్డ్ అవుట్

డ్యూడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 1: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం డ్యూడ్. కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అయిన డ్యూడ్ మూవీ అక్టోబర్ 17న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో డ్యూడ్ తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో లుక్కేద్దాం.

Published on: Oct 18, 2025, 06:42:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా డ్యూడ్. అసిస్టెంట్ డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అయిన డ్యూడ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన డ్యూడ్ సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాక్ వచ్చింది.

డ్యూడ్ మూవీకి తొలిరోజు ఏకంగా 14 కోట్లు.. ప్రదీప్ రంగనాథన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్.. ఆ 2 సినిమాల రికార్డ్ అవుట్
డ్యూడ్ మూవీకి తొలిరోజు ఏకంగా 14 కోట్లు.. ప్రదీప్ రంగనాథన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్.. ఆ 2 సినిమాల రికార్డ్ అవుట్

డ్యూడ్ నెట్ కలెక్షన్స్

ఈ నేపథ్యంలో డ్యూడ్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఇప్పటికే ప్రదీప్ 2022 చిత్రం లవ్ టుడే, మమిత బైజు 2024 సినిమా ప్రేమలు ఓపెనింగ్‌ను అధిగమించింది. డ్యూడ్ సినిమాకు తొలిరోజున ఇండియాలో రూ. 10 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది.

డ్రాగన్‌ను బీట్ చేసి

అంటే, ఇప్పటికే ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ టుడే ఓపెనింగ్‌ను డ్యూడ్ సినిమా అధిగమించింది. లవ్ టుడ్ సినిమాకు రూ. 2.45 కోట్ల ఓపెనింగ్ వచ్చింది. అలాగే ప్రదీప్ రంగనాథన్ రెండో సూపర్ హిట్ మూవీ డ్రాగన్‌ను కూడా డ్యూడ్ బీట్ చేసేసింది. డ్రాగన్ సినిమాకు రూ. 6.5 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి.

పాజిటివ్ టాక్‌తో

ఇక మమిత బైజు బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమలు సినిమాకు రూ. 90 లక్షల ఓపెనింగ్‌ వచ్చింది. అది కూడా బీట్ చేసింది డ్యూడ్. అయితే, ప్రేమలు, డ్రాగన్ సినిమాలు ఆ తర్వాత పాజిటివ్ టాక్‌తో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాయి. కానీ, ఓపెనింగ్స్‌ను మాత్రం డ్యూడ్ బీట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ కలెక్షన్స్

డ్యూడ్ సినిమాకు రూ. 3.89 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ సినిమాకు రూ. 1.25 నుంచి 1.50 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌ను బట్టి వచ్చిన సమాచారం. ఆఫ్‌లైన్ లెక్కలతో మరింత పెరిగే అవకాశం ఉంది.

తమిళంలో డ్యూడ్ కలెక్షన్స్

అలాగే, తమిళంలో డ్రాగన్ ఓపెనింగ్ రోజున రూ. 5.75 కోట్ల కలెక్షన్స్ అందుకోగా ఆ మార్క్‌ను డ్యూడ్ దాటేయనుందట. అంటే తమిళంలో డ్యూడ్‌కు ఆరు కోట్ల మేర ఓపెనింగ్స్ రానున్నాయి.

డ్యూడ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఇక వరల్డ్ వైడ్‌గా డ్రాగన్ సినిమాకు 11 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు డ్యూడ్ ఆ మార్క్ కూడా దాటేసి ప్రపంచవ్యాప్తంగా రూ. 13 నుంచి 14 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని సమాచారం. ఇది ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్‌గా అవనున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More