చెడ్డ అలవాటు ఉందన్న ప్రభాస్-స్పిరిట్ నుంచి అదిరే అప్‌డేట్-హైప్ పెంచేసిన సందీప్ వంగా- మూవీ స్టోరీ వీడియో వైరల్
స్పిరిట్ మూవీ నుంచి అదిరే అప్ డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కు క్రేజీ గిఫ్ట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. సౌండ్ స్టోరీ అంటూ కేవలం డైలాగ్స్ వినిపించే వీడియోను రిలీజ్ చేశాడు. ప్రభాస్ బర్త్ డేను గ్రాండ్ గా ముగించాడు.
గురువారం (అక్టోబర్ 23) డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ పండగ. ఆ రోజు ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న మూవీ టైటిల్ ను ఫౌజీగా అనౌన్స్ చేశారు. ఇక ఈ బర్త్ డే సంబరాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా నైట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అదిరిపోయే ట్రీట్ అందించారు.

స్పిరిట్ అప్ డేట్
ప్రభాస్ బర్త్ డే రోజు రాత్రి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్ డేట్ అందించాడు. సౌండ్ స్టోరీ అంటూ కేవలం డైలాగ్ లు మాత్రమే వినిపిస్తున్న వీడియోతో మూవీ హైప్ ను మరింత పెంచేశారు.
‘‘హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అన్న. ప్రతి అభిమాని కోసం హార్ట్ నుంచి నేరుగా అయిదు భాషల్లో సౌండ్ స్టోరీని అందిస్తున్నాం’’ అని సందీప్ రెడ్డి వంగా ఎక్స్ లో రాత్రి పోస్టు చేశాడు. స్పిరిట్ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కుతోంది.
స్పిరిట్ స్టోరీ
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలతో సంచలనాలు నమోదు చేస్తున్న సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ మూవీ అనగానే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ సౌండ్ స్టోరీతో అవి మరింత పెరిగిపోయాయి. రాత్రి 11 గంటలకు రిలీజ్ చేసిన వీడియోను బట్టి చూస్తే స్పిరిట్ సినిమాలో ఎవరినీ లెక్క చేయని ఐపీఎస్ అధికారిగా ప్రభాస్ నటించనున్నాడని తెలుస్తోంది.
అకాడమీ టాపర్ సార్
వీడియోలో జైలు సూపరింటెండెంట్ గా ప్రకాష్ రాజ్, ఓ కానిస్టేబుల్, చివర్లో ప్రభాస్ వాయిస్ వినిపించాయి. ఎవడ్రా వీడు అంటే కొత్త ఖైదీ అనే డైలాగ్ తో వీడియో స్టార్ట్ అయింది. ఇది పరేడ్ గ్రౌండ్ కాదు వాక్ ఫాస్ట్ అని ప్రకాష్ రాజ్ చెప్తాడు. ఐపీఎస్ సర్, అకాడమీ టాపర్ సర్ అని కానిస్టబుల్ ప్రకాష్ రాజ్ కు చెప్తాడు. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు, ఓన్లీ నంబర్స్ వీడికి ఆ బ్లాక్ స్లేట్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్, రైట్, సెంటర్ ఫొటోస్ తీయండని ప్రకాష్ రాజ్ అంటాడు.
ఖైదీ యూనిఫాం
వీడి గురించి విన్నాను. యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్ లో తేడా ఉండదని. కాండక్ట్ ఇష్యూ వల్ల ఒకసారి టెర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా బిహేవ్ చేస్తాడో. ‘ఖైదీ యూనిఫాం ఏంటి సార్ ఇది రిమాండ్ పీరియడ్’ కదా అని కానిస్టేబుల్ ప్రశ్నిస్తాడు. ‘షటప్, నా కాంపౌండ్ లో సివిలియన్ కాస్ట్యూమ్స్ నచ్చదు. ఖాకీ లేదా ఖైదీ మాత్రమే ఉండాలి. వీడి బట్టలూడదీసి మెడికల్ టెస్టులకు పంపించండి’ అని ప్రకాష్ రాజ్ రూత్ లెస్ గా చెప్తాడు.
బ్యాడ్ హ్యాబిట్
చివర్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్ మామూలుగా పేలలేదు. ‘మిస్టర్ సూపరింటెండెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఓ చెడ్డ అలవాటు ఉంది’ అని ప్రభాస్ చెప్తాడు. దీన్నే ఇంగ్లీష్ లోనూ చెప్పడంతో వీడియో ముగుస్తుంది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. స్పిరిట్ సినిమాలో త్రిప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్, కాంచన తదితరులు నటిస్తున్నారు.
భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2026లో ఈ మూవీని రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


