సునీల్‌తో తమిళ హీరో హరీష్ కల్యాణ్ యాక్షన్ థ్రిల్లర్- అదిరిపోయిన దాషమకాన్ టైటిల్ ప్రోమో- హీరోయిన్‌గా కన్నప్ప బ్యూటీ
తమిళ హీరో హరీష్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దాషమకాన్. టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన దాషమకాన్ టైటిల్ ప్రోమో అదిరిపోయింది.
పార్కింగ్ వంటి సినిమాలతో అలరిస్తున్నాడు తమిళ హీరో హరీష్ కల్యాణ్. ఇలా వైవిధ్యమైన సినిమాలో ఆకట్టుకుంటోన్న యంగ్ హీరో హరీష్ కల్యాణ్ కథానాయకుడుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దాషమకాన్’.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా
ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్ బ్యానర్స్‌పై మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దాషమకాన్ తెరకెక్కుతోంది. వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ రెండు భాషల్లో దాషమకాన్ సినిమాను విడుదల చేస్తున్నారు.
దాషమకాన్ టైటిల్ ప్రోమో రిలీజ్
ఈ సందర్భంగా తాజాగా శనివారం (నవంబర్ 22) నాడు దాషమకాన్ టైటిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. డిఫరెంట్ యాక్షన్ ఎలిమెంట్‌తో దాషమకాన్ టైటిల్ ప్రోమో అదిరిపోయింది. టైటిల్ ప్రోమోను గమనిస్తే.. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మనుషులు హీరోని వెతుక్కుంటూ.. ఎలాగైనా చంపాలని ఆయుధాలతో వెంబడిస్తుంటారు.
బిక్క చచ్చిపోయే విలన్ మనుషులు
హీరో బాత్రూమ్‌లోకి వెళతాడు. వాళ్లు కూడా ఫాలో అవుతూ వెళతారు. హీరో బాత్రూమ్‌లో ఒకడ్ని వేసేసి తాపీగా బయటకు నడుచుకుని వస్తాడు. హీరో చంపాలనుకున్న విలన్ మనుషులు బిక్క చచ్చిపోతారు. ఈ సీన్స్‌తో టైటిల్ ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
పూర్తి భిన్నమైన పాత్రలో
హరీష్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన రోల్ ఇది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా కనిపిస్తోంది. దాషమకాన్ టైటిల్ ప్రోమోలో చేతిలో చురకత్తి తిప్పుతాడు హీరో. అది చేతిలో పాటలు పాడే మైక్‌లా మారిపోతుంది. అంటే ఈ సినిమాలో హీరో పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయనేది తెలుస్తోంది.
రెండు షేడ్స్‌లో హరీష్ కల్యాణ్
ఓ షేడ్‌లో పాటలు పాడితే.. మరో షేడ్‌లో మాస్ అవతార్‌లో యాక్షన్‌తో దుమ్మురేపుతుంటాడు. మరి ఈ రెండు షేడ్స్ వెనుకున్న అసలు కథ తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కలిగేలా దాషమకాన్ టైటిల్ ప్రోమోను రిలీజ్ చేశారు.
హీరోయిన్‌గా ప్రీతీ ముకుందన్
ఇకపోతే దాషమకాన్ సినిమాలో హరీష్ కళ్యాణ్ సరసన కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్, బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సునీల్‌తో తమిళ హీరో హరీష్ కల్యాణ్ చేస్తున్న ఈ సినిమాకు బ్రిట్టో మైకేల్ సంగీతాన్నిఅందిస్తున్నారు.
సినిమాటోగ్రఫీ-ఎడిటింగ్
అలాగే, దాషమకాన్ సినిమాకు కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫీ, జి.మదన్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. దాషమకాన్ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


