బ్రహ్మముడి నవంబర్ 25 ఎపిసోడ్: రాహుల్ పేరు మీదే కంపెనీ.. కుటుంబాన్ని వీధిలో పడేస్తానన్న రాహుల్.. రాజ్‌ను నిలదీసిన తాతయ్య

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 25) ఎపిసోడ్ లో కొత్త కంపెనీని రాహుల్ పేరు మీదే మొదలుపెడుతున్నట్లు రాజ్ చెబుతాడు. అయితే ఈ విషయంలో తాతయ్య రాజ్ ను నిలదీయగా.. కుటుంబాన్ని వీధిలో పడేస్తానని రాహుల్ ప్రతిజ్ఞ చేస్తాడు.

Published on: Nov 25, 2025, 06:56:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 887వ ఎపిసోడ్ లో ఆర్ పేరు మీద కంపెనీ ఏంటి? ఎందుకు అనే విషయాలను ఇంట్లో వాళ్లందరికీ చెబుతారు రాజ్, కావ్య. దీంతో స్వప్న కాస్త వెనక్కి తగ్గుతుంది. కానీ రాహుల్, రుద్రాణి బుద్ధి మారకపోగా.. మరో కుట్రకు తెరతీస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి నవంబర్ 25 ఎపిసోడ్: రాహుల్ పేరు మీదే కంపెనీ.. కుటుంబాన్ని వీధిలో పడేస్తానన్న రాహుల్.. రాజ్‌ను నిలదీసిన తాతయ్య
బ్రహ్మముడి నవంబర్ 25 ఎపిసోడ్: రాహుల్ పేరు మీదే కంపెనీ.. కుటుంబాన్ని వీధిలో పడేస్తానన్న రాహుల్.. రాజ్‌ను నిలదీసిన తాతయ్య

రాజ్ ఫోన్ ద్వారా నిజం తెలుసుకున్న రాహుల్

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 25) ఎపిసోడ్ రాజ్ ఫోన్ ను స్వప్న తీసుకొని రాహుల్ దగ్గరికి రావడంతో మొదలవుతుంది. అందులో ఆర్ పేరుతో కొత్త కంపెనీ మొదలుపెట్టబోతున్నారని, స్వరాజ్ కంపెనీ నుంచి కేజీల కొద్దీ బంగారం, డబ్బు తెలియకుండానే ట్రాన్స్‌ఫర్ చేశారని స్వప్నతో చెబుతాడు రాహుల్.

దీంతో ఇప్పుడే నిలదీద్దాం పదా అని స్వప్న అంటుంది. కానీ వద్దని రాహుల్ వారిస్తాడు. అయినా వినకుండా స్వప్న వెళ్తుంది. తనకూ అదే కావాలని రాహుల్ అనుకుంటాడు.

ఆర్ ఫ్యాక్టరీ ఏంటంటూ రాజ్‌ను నిలదీసిన స్వప్న..

కింద అందరూ అపర్ణ, సుభాష్ పెళ్లి రోజు వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ సంతోషంగా ఉంటారు. స్వప్న వచ్చి పిలిచినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె ఫ్లవర్ వాజ్ ను విసిరేస్తుంది. అది చూసి దీనికి దెయ్యం పట్టినట్లుందని ఇందిరాదేవి అంటుంది. రాజ్ ను స్వప్న నిలదీస్తుంది. ఆర్ పేరుతో ఫ్యాక్టరీ ఎందుకు పెడుతున్నారు?

ఆర్ అంటే రాజే కదా? స్వరాజ్ కంపెనీ నుంచి ఎందుకు డబ్బు, కేజీల కొద్దీ బంగారం ఎందుకు తరలించారు? మా ఆయనపై దొంగతనం నింద వేయడానికా అని రాజ్ ను నిలదీస్తుంది. ఆమెకు రుద్రాణి కూడా సపోర్ట్ చేస్తూ మరింత రెచ్చగొడుతుంది. సుభాష్, అపర్ణ రాజ్ కు మద్దతిస్తూ మాట్లాడినా వాళ్లు వినరు. రాజ్ మౌనంగా ఎందుకు ఉన్నాడంటూ అడుగుతారు.

నిజం అంగీకరించిన రాజ్.. ఆర్ అంటే రాహుల్ అంటూ..

దీంతో మొత్తానికి రాజ్ నోరు తెరుస్తాడు. ఆర్ పేరుతో కంపెనీ నిజం.. కానీ ఆర్ అంటే రాజ్ కాదు రాహుల్ అంటాడు. అయినా స్వప్న, రుద్రాణి నమ్మరు. కానీ తాను ఇలా ఎందుకు కొత్త కంపెనీ మొదలుపెట్టానో రాజ్ చెబుతాడు. స్వరాజ్ కంపెనీలో రాహుల్ కు బాధ్యత ఇచ్చినా తన సొంత కంపెనీలా ఫీలవడని, తనకంటూ సొంతంగా కంపెనీ మొదలుపెడితే బాధ్యత వస్తుందని అలా చేశానని అంటాడు. ఇప్పుడు కావాలని మాట మారుస్తున్నావా అంటూ రుద్రాణి అడుగుతుంది.

గట్టిగా సమాధానం ఇచ్చిన కావ్య.. అక్కకి క్లాస్

దీంతో కావ్య రంగంలోకి దిగుతుంది. రుద్రాణితోపాటు అక్కకి కూడా క్లాస్ పీకుతుంది. మీ ఆయన అసమర్థుడు కాడు అని నిరూపించడానికి ఇలా చేశామని అంటుంది. రాహుల్ పేరు మీద కంపెనీ అంటే అందరూ వద్దంటారనే చెప్పకుండా చేశామని చెబుతుంది. అయినా ఈ పని చేస్తే తమకు ఏం వస్తుంది? నెత్తి మీద కిరీటాలు వస్తాయా అని గట్టిగానే అడుగుతుంది. ఇప్పటి వరకూ మీకు అన్యాయం జరిగిపోతున్నట్లు ఏడ్చావు కదా ఇప్పుడేమంటావని అడుగుతుంది.

క్షమాపణ అడిగిన స్వప్న, రాహుల్

దీంతో స్వప్న, రాహుల్ వాళ్లను క్షమాపణ అడుగుతారు. మీ మంచితనం గురించి తెలిసి కూడా తాను అనుమానించి మీ మీద నింద వేశానని, తనను క్షమించమని స్వప్న అంటుంది. అటు రాహుల్ కూడా ఇదంతా తన వల్లే జరిగిందని, బంగారం, డబ్బు వేరే కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేయడంతో నింద తన మీద ఎక్కడ పడుతుందో అన్న భయంతో తానే స్వప్నకు ఈ విషయం చెప్పానని రాహుల్ అంటాడు.

అందరి ముందూ మరోసారి నాటాకాన్ని రక్తి కట్టిస్తాడు. అయితే కొత్త కంపెనీ పెట్టినందుకు రాజ్, కావ్యలను తాతయ్య సీతారమయ్య నిలదీస్తాడు. ఇది కుటుంబం విచ్ఛిన్నం కావడానికి దారి తీస్తుందని హెచ్చరిస్తాడు. అటు రుద్రాణితో రాహుల్ కూడా అదే ప్లాన్ వేస్తాడు. మెల్లగా కుటుంబాన్ని వీధిలోకి లాగుతానని అంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More