9 నిమిషాల్లో టార్గెట్ రీచ్ అయి 3 రోజుల్లో మోకాళ్ల మీద కూర్చోబెట్టారు.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కామెంట్స్

డైరెక్టర్ బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో సినిమా అఖండ 2 తాండవం. ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, పూర్ణ, హర్షాలి మల్హోత్రా ఇతర ముఖ్య పాత్రలు పోషించిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోయపాటి శ్రీను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Nov 30, 2025, 11:19:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బోయపాటి మాట్లాడుతూ.. "ఈ వేడుకల్లో పాల్గొన్న పెద్ద వాళ్లందరకీ, సోదర సమానులైన నందమూరి అభిమానులకు సినీ అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు" అని అన్నారు.

9 నిమిషాల్లో టార్గెట్ రీచ్ అయి 3 రోజుల్లో మోకాళ్ల మీద కూర్చోబెట్టారు.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కామెంట్స్
9 నిమిషాల్లో టార్గెట్ రీచ్ అయి 3 రోజుల్లో మోకాళ్ల మీద కూర్చోబెట్టారు.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కామెంట్స్

వారి కారణంగానే షూటింగ్

"తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి కారణంగానే సినిమా అద్భుతంగా షూటింగ్ చేసుకోగలిగాం. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు కృతజ్ఞతలు. బాలయ్య గారే మా ఆస్తి బాలయ్య గారు మా పవర్ ఆయనే మా ధైర్యం. సంయుక్త, ఆది పినిశెట్టి, మురళీమోహన్ గారు హర్షాలి అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు" అని బోయపాటి చెప్పారు.

సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారు

"ఇప్పుడే సెన్సార్ నుంచి వచ్చాను. సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు చాలా గౌరవంగా అభినందించారు. ఈ సినిమా తర్వాత మీరు గౌరవమైన స్థానంలో ఉంటారని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది" అని బోయపాటి శ్రీను తెలిపారు.

దేవుడు ఒప్పుకుంటాడా

"రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం అయినవి. ఇలాంటి మార్గదర్శకత్వం చూపించిన దేశాన్ని ముట్టుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా.." అని ప్రశ్నించారు బోయపాటి శ్రీను.

మూడు రోజుల్లో

"పెహెల్గామ్ దాడిలో మన ఆడబిడ్డ నుదుటిన ఉన్న సింధూరాన్ని ముట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి భారతదేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మన సైనికులు చూపించారు. తొమ్మిది మిషాల్లో టార్గెట్ రీచ్ అయ్యి మూడు రోజుల్లో మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. అది మన సైన్యం. మనందరం అభినందించాలి. క్లాప్స్ కొట్టాలి" అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.

కులాలు, మతాలు లేవు

"ఈ పరిశ్రమ ఒక్కరితో కాదు అందరితో కూడుకున్నది. ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలి. వాళ్లకి మంచి చెప్పడానికి ప్రయత్నించాలి. అన్ని సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించాలి పరిశ్రమ బావుండాలి" అని బోయపాటి శ్రీను పేర్కొన్నారు.

వరల్డ్ వైడ్ ప్రేక్షకులు

"ప్రతి సినిమాకి మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ.. అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ ప్రేక్షకులు ఈ సినిమాని ఆనందంగా చూడాలని కోరుకుంటున్నాను" అని అఖండ 2 తాండవం డైరెక్టర్ బోయపాటి శ్రీను కోరారు.

అఖండ 2 నటీనటులు

ఇదిలా ఉంటే, బ్లాక్ బస్టర్ హిట్ అఖండ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 తాండవం వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా హీరో ఆది పినిశెట్టి యాక్ట్ చేశాడు. బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా మరో బ్యూటి పూర్ణ కీలక పాత్ర పోషించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More