పెద్ద లారీ వెనకాల వస్తుంటే చిన్న కారు పక్కకు తప్పుకోవాల్సిందే: అఖండ 2 రిలీజ్ డేట్ మారడంపై బన్నీ వాసు కామెంట్స్
హైవేపై పెద్ద లారీ వస్తుంటే.. చిన్న కారు పక్కకు తప్పుకోవాల్సిందే అంటూ నిర్మాత బన్నీ వాసు అన్నాడు. అఖండ 2, ఇతర చిన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానుండటంపై అతడు ఇలా కామెంట్ చేశాడు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.
బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 మూవీ రిలీజ్ వాయిదా ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలకు ముప్పుగా మారింది. గత వారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఈ శుక్రవారం (డిసెంబర్ 12) రిలీజ్ కానుండటంతో ఆ రోజు ప్లాన్ చేసుకున్న పలు చిన్న సినిమాలకు దెబ్బ పడనుంది. దీనిపై నిర్మాత బన్నీ వాసు స్పందించాడు.

బన్నీ వాసు ఏమన్నాడంటే?
అఖండ 2 రిలీజ్ వారం రోజులు వాయిదా పడటాన్ని ఈషా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో మీడియా ప్రతినిధులు లేవనెత్తారు. దీని ప్రభావం చిన్న సినిమాలపై పడుతుందా అని ప్రశ్నించారు. దీనికి బన్నీ వాసు స్పందిస్తూ.. అఖండ 2 మూవీని పెద్ద లారీతో పోల్చాడం గమనార్హం.
“ఈ విషయాన్ని నేను సింపుల్‌గా చెబుతాను. మనం హైవేపై ఓ చిన్న కారులో వెళ్తున్నాం. వెనకాల నుంచి ఓ పెద్ద లారీ వచ్చి హారన్ కొడుతోంది. అప్పుడు మనం తప్పుకొని ఆ పెద్ద లారీని వెళ్లనివ్వాల్సిందే తప్ప మరో అవకాశం ఉండదు” అని బన్నీ వాసు అన్నాడు.
అఖండ 2 మూవీ ఎఫెక్ట్ ఇలా..
బాలకృష్ణ అఖండ 2 మూవీ నిజానికి డిసెంబర్ 5నే రిలీజ్ కావాల్సింది. కానీ కోర్టు కేసు కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ సినిమాకు కోర్టు క్లియరెన్స్ రావడంతో డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ అప్పటికే ఆ రోజు కొన్ని చిన్న సినిమాలు తమ రిలీజ్ డేట్లను అనౌన్స్ చేశాయి. మోగ్లీ, ఈషా, సైక్ సిద్ధార్థలాంటి మూవీస్ రిలీజ్ కు సిద్ధమయ్యాయి. అఖండ 2 దెబ్బకు ఇప్పటికే మోగ్లీ ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13న రానుంది. ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ దీనిపై ఇప్పటికే తన ఆవేదన వ్యక్తం చేశాడు. అటు సైక్ సిద్ధార్థ అయితే ఏకంగా జనవరి 1కి వాయిదా పడింది.
హారర్ థ్రిల్లర్ మూవీ ఈషా మాత్రం అదే రోజు రానుంది. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించాడు. ఈ మూవీ చాలా భయపెడుతుందంటూ ఇప్పటికే సినిమాను ప్రమోట్ చేస్తున్న బన్నీ వాసు.. తాజాగా ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేశాడు. మరి అఖండ 2 మూవీ ప్రభావం ఈ ఈషాతోపాటు సైక్ సిద్ధార్థపై ఎంత వరకూ ఉంటుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


