అఖండ 2 రిలీజ్-వేరే సినిమాలపై ఎఫెక్ట్-నందు మూవీ పోస్ట్ పోన్-ఆ డైరెక్టర్ ఆవేదన

నంద‌మూరి బాల‌కృష్ణ‌ మూవీ అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఇతర సినిమాలకు కష్టాలు తప్పడం లేదు. నందు హీరోగా చేసిన సైక్ సిద్ధార్థ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.  

Published on: Dec 10, 2025, 09:07:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అఖండగా మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి నందమూరి బాల‌కృష్ణ‌ వచ్చేస్తున్నారు. ఆయన డ్యుయల్ రోల్ ప్లే చేసిన అఖండ 2 తాండవం మూవీ డిసెంబర్ 12న రిలీజ్ అవుతుంది. రేపు (డిసెంబర్ 11) ప్రీమియర్లు పడుతున్నాయి. కోర్టు కేసు కారణంగా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన అఖండ 2 విడుదల డేట్ మారింది. ఇది వేరే సినిమాలపై ప్రభావం చూపిస్తుంది.

అఖండ 2 సినిమా పోస్టర్ లో నంద‌మూరి బాల‌కృష్ణ‌ (x/NbkUpdates)
అఖండ 2 సినిమా పోస్టర్ లో నంద‌మూరి బాల‌కృష్ణ‌ (x/NbkUpdates)

అఖండ 2 రిలీజ్ డేట్

బోయపాటి శ్రీను-నందమూరి బాల‌కృష్ణ‌ కాంబోలో తెరకెక్కిన మరో మూవీ అఖండ 2. దీనిపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్ తో హైప్ మరింత పెరిగిపోయింది. కానీ కోర్టు స్టే కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. మంగళవారం రాత్రి ఈ అనౌన్స్ మెంట్ చేశారు అఖండ 2 మేకర్స్.

సడెన్ షాక్

అఖండ 2 రిలీజ్ అనౌన్స్ మెంట్ కొన్ని సినిమాలకు సడెన్ షాక్ లా తగిలింది. డిసెంబర్ 12న చాలా సినిమాలు థియేటర్లకు రాబోతున్నాయి. ముందే రిలీజ్ డేట్ ప్రకటించేసి, ఆ మేరకు ప్లాన్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఆ రోజున అఖండ 2 లాంటి పెద్ద సినిమా రిలీజ్ తమ చిత్రాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన పడుతున్నారు. అఖండ 2 లాంటి సినిమా వస్తే ఇతర చిత్రాలకు తగినన్ని థియేటర్లు దొరకవు. ఇక ఆడియన్స్ కూడా ఆ సినిమాను వదిలేసి తమ చిత్రాల కోసం మళ్లీ థియేటర్లలోకి వస్తారనే నమ్మకం కూడా లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

నందు సినిమా పోస్ట్ పోన్

టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు నందు. ఈటీవీలో డ్యాన్స్ షో ఢీకి యాంకర్ గా చేస్తున్న నందు.. లేటెస్ట్ గా ‘సైక్ సిద్ధార్ధ’ అంటూ థియేటర్లకు రావడానికి రెడీ అయిపోయారు. ఈ మూవీ డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు అఖండ 2 అదే రోజు వస్తుంది. దీంతో బాలయ్య బాబు మీద ప్రేమతో తమ సినిమాను జనవరి 1కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. రానా, నందు స్పెషల్ వీడియోతో ఈ అనౌన్స్ మెంట్ చేశారు.

సందీప్ ఆవేదన

కలర్ ఫోటో సినిమా తీసి నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్. అతను ఇప్పుడు మోగ్లీ సినిమాను రెడీ చేశాడు. ఇందులో సుమ, రాజీవ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరో. ఈ సినిమాను డిసెంబర్ 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అఖండ 2 కారణంగా మోగ్లీ వచ్చే సూచనలు కనిపించడం లేదు. అందుకే తనే బ్యాడ్ లక్ అంటూ బాధపడ్డాడు సందీప్. అయితే డిసెంబర్ 12నే తన సినిమా తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయాడు.

ఈ మూవీస్ కూడా

డిసెంబర్ 12న కార్తి మూవీ అన్నగారు వస్తారు సహా ఈషా, ఫెయిల్యూర్ బాయ్స్, సైక్ సిద్ధార్థ, మోగ్లీ, మిస్టీరియస్ తదితరులు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. మరి ఇందులో సైక్ సిద్ధార్థ రిలీజ్ ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది. మిగతా సినిమాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More