అఖండ 2 వచ్చేస్తోంది-థియేటర్లో పూనకాలే-కొత్త రిలీజ్ డేట్ ఇదే-ఈ వారమే విడుదల-బాలయ్య ఫ్యాన్స్ ఖుష్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ 2' మూవీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడు కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఇక థియేటర్లో పూనకాలే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 

Published on: Dec 10, 2025 5:54 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సస్పెన్స్ కు తెరపడింది. బాలకృష్ణ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యే వార్త ఇది. అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ముందుగా అనౌన్స్ చేసిన షెడ్యూల్ కంటే ఒక వారం ఆలస్యంగా అఖండ 2 థియేటర్లకు రాబోతుంది. డిసెంబర్ 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 11న ప్రీమియర్స్ ఉంటాయి.

అఖండ 2 పోస్టర్ లో బాలకృష్ణ
అఖండ 2 పోస్టర్ లో బాలకృష్ణ

అఖండ 2 రిలీజ్ డేట్

అఖండ 2 సినిమాకు ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండి, చివరి నిమిషంలో వాయిదా పడిన నందమూరి బాలకృష్ణ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ కొత్త తేదీని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ మంగళవారం రాత్రి తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ప్రకటించింది.

వారం రోజులకు

వాయిదా తర్వాత వారం రోజులకు విడుదల అవుతుంది 'అఖండ 2' సినిమా. ఈ మూవీ కొత్త పోస్టర్‌ను పంచుకుంటూ, "బాక్స్ ఆఫీస్ వద్ద దైవిక విధ్వంసానికి సిద్ధంగా ఉన్నారా? డిసెంబర్ 11న గ్రాండ్ ప్రీమియర్‌లతో డిసెంబర్ 12 నుండి థియేటర్లలో అఖండ 2 మాస్ పవర్ ను అనుభవించండి. బుకింగ్స్ త్వరలో ప్రారంభం!" అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. అఖండ 2 రిలీజ్ కంటే ఒక రోజు ముందు ప్రీమియర్స్ కూడా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.

అఖండ 2 రిలీజ్ డేట్ పోస్టర్
అఖండ 2 రిలీజ్ డేట్ పోస్టర్

వాయిదాపై వివరణ

విడుదల తేదీకి కొద్ది గంటల ముందు, నిర్మాతలు అభిమానులను షాక్‌కు గురిచేస్తూ అఖండ 2 సినిమా షెడ్యూల్ ప్రకారం విడుదల కాదని తెలిపారు. తమ ఎక్స్ ఖాతాలో 14 రీల్స్ ప్లస్ అభిమానులకు క్షమాపణలు చెప్పింది కానీ వాయిదాకు నిర్దిష్ట కారణాలను వెల్లడించలేదు.

ఆ పోస్ట్‌లో ఇలా పేర్కొంది.. "అఖండ 2ను పెద్ద తెరపైకి తీసుకురావడానికి మేము మా వంతు కృషి చేశాము. కానీ మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతాయి. దురదృష్టవశాత్తు ఇది ఆ సమయమే. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినిమా ప్రియులందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాము" అని పోస్ట్ చేసింది.

కోర్టు కేసు క్లియర్

నిర్మాతలు వాయిదాకు కారణాన్ని వెల్లడించనప్పటికీ, కొనసాగుతున్న కోర్టు కేసు దీనికి కారణం. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 11 సంవత్సరాలుగా ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ కు సుమారు రూ.28 కోట్లు, వడ్డీ చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించిన మధ్యవర్తిత్వ డబ్బు పెండింగ్‌లో ఉంది. దీనిపై ఈరోస్ కోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హై కోర్టు అఖండ 2 రిలీజ్ పై స్టే విధించింది. ఇప్పుడు ఆ కేసు క్లియర్ అయింది.

అఖండ 2 గురించి

'అఖండ 2: తాండవం' 2021 బ్లాక్‌బస్టర్ 'అఖండ'కు సీక్వెల్. దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. బాలకృష్ణతో పాటు ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఎస్ స్వరపరిచిన చిత్రంలోని పాటలకు అభిమానుల నుండి సానుకూల స్పందన లభించింది.