బాలకృష్ణ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు.. కొన్ని మన నియంత్రణలో ఉండవన్న నిర్మాణ సంస్థ

బాలకృష్ణ అఖండ 2 మూవీ ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. దీంతో బాలయ్య అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. సాంకేతిక కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొడక్షన్ హౌస్ తెలిపింది. కేవలం ఇండియాలోనే ఈ పరిస్థితి తలెత్తింది.

Published on: Dec 4, 2025, 20:04:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 మూవీ ప్రీమియర్ షోల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. గురువారం (డిసెంబర్ 4) ఉండాల్సిన ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు ప్రొడక్షన్ హౌస్ 14 రీల్స్ ప్లస్ వెల్లడించింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ షోలు ఉండనున్నాయి.

బాలకృష్ణ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు.. నిర్మాణ సంస్థ ఏం చెప్పిందంటే?
బాలకృష్ణ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు.. నిర్మాణ సంస్థ ఏం చెప్పిందంటే?

అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు

అఖండ 2 ప్రీమియర్ షోల కోసం గురువారం (డిసెంబర్ 4) ఉదయం నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే సాయంత్రం నిర్మాణ సంస్థ ఈ షోలను రద్దు చేస్తున్నట్లు చెప్పడంతో వాళ్లు ఉసూరుమన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఇండియా వ్యాప్తంగా ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు 14 రీల్స్ ప్లస్ చెప్పింది.

“సాంకేతిక కారణాల వల్ల ఇవాళ ఇండియాలో ఉండాల్సిన అఖండ 2 ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నాం. మా శక్తి మేర ప్రయత్నించాం. కానీ కొన్ని మన నియంత్రణలో ఉండవు. అసౌకర్యానికి క్షమించమని కోరుతున్నాం. ఓవర్సీస్ ప్రీమియర్స్ మాత్రం ఈరోజు షెడ్యూల్ ప్రకారమే ఉంటాయి” అని ఆ సంస్థ స్పష్టం చేసింది.

అఖండ 2 టికెట్ల ధరలు

మరోవైపు అఖండ 2 మూవీ టికెట్ల ధరలు ఇటు ఏపీ, తెలంగాణల్లో పెరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీ ప్రీమియర్ షోలకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. ఇప్పుడు ఆ షోలు కాస్తా రద్దయ్యాయి. ఇక తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. మొదటి మూడు రోజులు పెంచిన ధరలు అమల్లో ఉంటాయి.

అటు ఏపీలోనూ టికెట్ల ధరలు పెంచగా.. పది రోజుల వరకు ఈ ధరలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అయితే అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దవడం మాత్రం అభిమానులకు మింగుడు పడటం లేదు. ఇండియా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో ఇక ఫస్ట్ రివ్యూల కోసం ఓవర్సీస్ ప్రీమియర్ షోల వైపు అభిమానులు చూస్తున్నారు. అక్కడి నుంచి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More