ఓటీటీలో ఎంటర్‌టైన్మెంట్ మోత-2026లో వచ్చే సౌత్ సినిమాలు, సిరీస్‌లు అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్-ఓ లుక్కేయండి
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ఎంటర్ టైన్మెంట్ మోత మోగిపోనుంది. ఓటీటీలో ఎప్పుడూ లేని సందడి 2026లో రాబోతుంది. వచ్చే ఏడాది రిలీజ్ చేసే సౌత్ సినిమాలు, సిరీస్ లను ఈ ఓటీటీ ప్రకటించింది.
ఓటీటీ ఆడియన్స్ కోసం అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ ను తెచ్చేస్తోంది పాపులర్ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్. 2026లో స్ట్రీమింగ్ చేసే జియోహాట్‌స్టార్ స్పెషల్ సినిమాలు, సిరీస్ లు, షోల వివరాలను జియోహాట్‌స్టార్ ప్రకటించింది. జియోహాట్‌స్టార్ సౌత్ అన్ బౌండ్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో వచ్చే ఏడాది సౌత్ లో రాబోతున్న సినిమాలు, సిరీస్ లు, షోల టైటిల్స్ ను అనౌన్స్ చేసేసింది.

ఓటీటీలో సౌత్ సందడి
జియోహాట్‌స్టార్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2026లో వచ్చే తమ స్పెషల్ సినిమాలు, సిరీస్ లు, షోల లిస్ట్ ను మంగళవారం (డిసెంబర్ 9) రాత్రి ఈవెంట్లో ప్రకటించేసింది. ఇందుకోసం జియోహాట్‌స్టార్ సౌత్ అన్ బౌండ్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి నాగార్జున, మోహన్ లాల్, విజయ్ సేతుపతి తదితర స్టార్లు హాజరయ్యారు. ఇక్కడ జియోహాట్‌స్టార్ రిలీజ్ చేసిన ఓటీటీ కమింగ్ ప్రాజెక్ట్ ల ఫుల్ లిస్ట్ ఉంది.
తెలుగు
బిగ్ బాస్ తెలుగు (షో)
మూడు లాంతర్లు
విక్రమ్ ఆన్ డ్యూటీ
వరం
బ్యాచ్ మేట్స్
సేవ్ ది టైగర్స్ సీజన్ 3
మేడ్ ఫర్ ఈచ్ అదర్
రోడీస్
విశాఖ
తమిళం
బిగ్ బాస్ తమిళం
గుడ్ వైఫ్ సీజన్ 2
ఎల్బీడబ్లూ
లక్కీ ది సూపర్ స్టార్
రీసార్ట్
హార్ట్ బీట్ సీజన్ 3
లింగం
లవ్ అల్వేస్
కాట్టన్
సెకండ్ లవ్
కెనత కానోమ్
మలయాళం
బిగ్ బాస్ మలయాళం
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 3
కజిన్స్ అండ్ కల్యాణమ్స్
సీక్రెట్ స్టోరీస్: రోస్లిన్
అనాలి
1000 బేబీస్ సీజన్ 2
ఫార్మా
కామెడీ కుక్స్
కన్నడ
బిగ్ బాస్ కన్నడ
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


