జియోహాట్‌స్టార్ సంచలనం-2026 కోసం భారీ ప్లాన్-ఒకే రోజు 40 సౌత్ టైటిల్స్ అనౌన్స్‌మెంట్-ఈవెంట్‌కు లెజెండరీ నటులు
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ సంచలనం నమోదు చేయబోతుంది. ఒకే రోజు ఏకంగా సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి 40 సినిమాలు, సిరీస్ లు, షోల టైటిల్స్ ను ప్రకటించనుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఈవెంట్ నిర్వహిస్తుంది.
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ సౌత్ పై తన పట్టును పెంచుకునేందుకు భారీ ప్లాన్ వేసింది. సౌత్ ఇండియా ఆడియన్స్ ను తనవైపు మరింతగా తిప్పుకునేందుకు మెగా ఈవెంట్ తో రాబోతుంది. సౌత్ అన్‌బౌండ్ పేరుతో భారీ ప్రోగ్రామ్ కు ప్లాన్ చేసిన జియోహాట్‌స్టార్ ఒకే రోజు సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు, సిరీస్ లు, షోల 40 టైటిళ్లను అనౌన్స్ చేయనుంది.

జియోహాట్‌స్టార్ సౌత్ అన్‌బౌండ్
సౌత్ అన్‌బౌండ్ పేరుతో జియోహాట్‌స్టార్ ఓటీటీ మెగా ఈవెంట్ కు ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్లోనే జియోహాట్‌స్టార్‌లో 2026లో రాబోతున్న 40 సినిమాలు, సిరీస్ లు, షోల టైటిల్స్ ను రివీల్ చేయనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులను రివీల్ చేయనుంది. డిసెంబర్ 9న చెన్నైలో ఈ ఈవెంట్ జరుగుతుంది.
లెజండరీ స్టార్లు
జియోహాట్‌స్టార్ సౌత్ అన్‌బౌండ్ ఈవెంట్ కు లెజెండరీ స్టార్లను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే మోహన్ లాల్, కమల్ హాసన్ తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఇన్విటేషన్ అందించారు. తెలుగు, కన్నడ నుంచి మరింత మంది దిగ్గజాలను పిలవబోతున్నారు. ఈ ఈవెంట్ పై హైప్ మరింత పెరిగే అవకాశముంది.
నెట్ ఫ్లిక్స్ జోరు
ఓ వైపు ఓటీటీ రంగంలో నెట్ ఫ్లిక్స్ దూకుడు ప్రదర్శించింది. ఇటీవల సౌత్ సినిమాల్లో ఎక్కువ భాగం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఈ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా డైరెక్ట్ గా సౌత్ ఇండియన్ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాలు, సిరీస్ లు రూపొందిస్తుంది.
ఈ క్రమంలో సౌత్ ఇండియాపై పట్టు సడలకుండా ఉండేందుకు జియోహాట్‌స్టార్ పెద్ద ప్లాన్ వేసింది. 2026లో తమ ఓటీటీలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల టైటిళ్లను ఒకేసారి అనౌన్స్ చేయనుంది. దీంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆడియన్స్ ను మరింత అట్రాక్ట్ చేయాలని చూస్తోంది.
జియోహాట్‌స్టార్ ట్రెండింగ్
ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ లో బిగ్ బాస్ జోరు కొనసాగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ట్రెండింగ్ నంబర్ వన్ గా ఉంది. ఈ సీజన్ లో ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత తమిళ సినిమా ఆన్ పావమ్ పొల్లతాతు, మలయాళం హారర్ థ్రిల్లర్ డైస్ ఇరే వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


