సినిమాలో సినిమా-డైరెక్టర్, హీరో ఈగో-ఓటీటీలోకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాంత-స్ట్రీమింగ్ ఆ రోజే
దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ కాంత ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ వారమే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఇందులో రానా దగ్గుబాటి కీ రోల్ ప్లే చేశాడు.
లేటెస్ట్ తమిళ హిట్ మూవీ కాంత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది ఈ దుల్కర్ సల్మాన్ మూవీ. ఈ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ లో దుల్కర్ నట విశ్వరూపం చూపించాడనే కామెంట్లు వినిపించాయి. ఇందులో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ ఏ ఓటీటీలో వస్తుందో ఇక్కడ చూసేయండి.

కాంత ఓటీటీ
రీసెంట్ టైమ్స్ లో సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించిన మూవీ పేరు కాంత. ఇదో మిస్టరీ థ్రిల్లర్. సినిమాలో సినిమా తీయడమే దీని కథ. అయితే ఇందులో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ అదిరిపోయిందనే టాక్ వినిపించింది. అతని కెరీర్ లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రివ్యూలు చెప్పాయి. ఈ కాంత మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. డిసెంబర్ 12 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
తెలుగులోనూ
కాంత సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ డైెరెక్టర్. స్పిరిట్ మీడియా, వేఫర్ ఫిల్మ్స్ పై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో దుల్కర్, రానాతో పాటు సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలోకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.
థియేటర్ రెస్పాన్స్
నవంబర్ 14, 2025న థియేటర్లలో రిలీజైంది కాంత మూవీ. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే కమర్షియల్ గా మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఇప్పుడు నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
కాంత మూవీ స్టోరీ
ఒక టాప్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ తీర్చిదిద్దిన హీరోకు మధ్య ఈగో ప్రధాన కథగా తీసుకుని తెరకెక్కించిన సినిమా కాంత. అయ్య (సముద్రఖని) తన తల్లి జీవితం ఆధారంగా ‘శాంత’ సినిమా తీయాలనుకుంటాడు. ఇందులో తన శిష్యుడైన టి.కె.మహదేవన్ (దుల్కర్) హీరో. కానీ సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ కొన్నాళ్ల తర్వాత మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ క్లైమాక్స్ తో పాటు టైటిల్ ను మారుస్తాడు హీరో. శాంత కాస్తా కాంతగా మారుతుంది.
ఆ హత్యతో
సెట్ లో హీరో, డైరెక్టర్ కు పడదు. అయినా తన తల్లి కథను తెరపై చూసుకోవాలనే ఆశతో అయ్య సినిమాను తెరకెక్కిస్తాడు. హీరో, డైరెక్టర్ ను కలపాలని హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ హత్య జరుగుతుంది. సినిమాకు సంబంధించిన కీలక వ్యక్తి హత్యను ఎంక్వైరీ చేసేందుకు దేవరాజ్ (రానా) వస్తాడు. మరి ఆ హత్య చేసింది ఎవరు? సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందా? అన్నది కాంత సినిమాలో చూడాల్సిందే.

E-Paper












