హ‌నీట్రాప్‌తో రివేంజ్‌.. ఓటీటీలోకి అదిరే క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

ఓటీటీలోకి ఓ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. హనీ ట్రాప్ తో రివేంజ్ తీర్చుకునే స్టోరీ లైన్ తో ఈ మూవీ తెరకెక్కింది. అదిరే ట్విస్ట్ తో సాగే ఈ సినిమా ఏంటీ? ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది?  అనే విషయాలను ఇక్కడ చూసేయండి.

Dec 7, 2025, 20:55:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీల క్రేజ్ పెరిగాక భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ వేరే లాంగ్వేజీలోని సినిమాలనూ తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్లను బాగా ఇష్టపడుతున్నారు. తమిళ, మలయాళం, కన్నడ థ్రిల్లర్లకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఆయా భాషల్లో సినిమాలు ఉన్నా చూడటానికి వెనుకాడటం లేదు. ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. ఇది గుజరాతీ థ్రిల్లర్ మూవీ ‘శుభచింతక్’.

ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్

శుభచింతక్ ఓటీటీ

క్రైమ్ థ్రిల్లర్ శుభచింతక్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ శుభచింతక్ మూవీ డిసెంబర్ 11న ఓటీటీలో అడుగుపెట్టనుంది. షెమరూమీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. థ్రిల్లర్లు ఇష్టపడే ఆడియన్స్ కు శుభచింతక్ సినిమా మంచి ఆప్షన్.

థియేటర్ రెస్పాన్స్

శుభచింతక్ సినిమా మే 30, 2025న థియేటర్లలో రిలీజైంది. స్వప్నిల్ జోషి, మానసి పరేఖ్, విరాఫ్ పటేల్ తదితరులు నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ గుజరాతీ సినిమాకు నిసర్గ్ వైద్య డైరెక్టర్. ఈ చిత్రం ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

శుభచింతక్ స్టోరీ

శుభచింతక్ సినిమా ఓ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్. హనీ ట్రాప్ తో రివేంజ్ తీర్చుకోవాలనుకునే అమ్మాయి కథ. మేఘన ఒక తెలివైన అమ్మాయి. సంజయ్ కారణంగా ఆమెకు అన్యాయం జరుగుతుంది. సంజయ్ పై రివేంజ్ తీర్చుకోవాలని మేఘన ప్లాన్ చేస్తుంది. హనీ ట్రాప్ తో బలి తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

మేఘనకు మరో ఇద్దరు హెల్ప్ చేస్తారు. ముందు సంజయ్ కు దగ్గర కావాలని మేఘన ప్రయత్నిస్తుంది. కానీ ఆ క్రమంలో వేరే ఛాలెంజ్ లు ఎదురవుతాయి. ప్రాణాలకు తెగించాల్సి వస్తుంది. ఈ స్టోరీ సాగుతున్నప్పుడే ఓ ట్విస్ట్ కథను మలుపు తిప్పుతుంది. మరి చివరకు ఏం జరిగింది? అసలు మేఘనకు జరిగిన అన్యాయం ఏంటీ? సంజయ్ ను హనీ ట్రాప్ తో ఎందుకు వలలో వేసుకోవాలని అనుకుంటుంది? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.