ఓటీటీలో అదరగొడుతున్న లేటెస్ట్ హార‌ర్ థ్రిల్ల‌ర్లు-చూపు తిప్పుకోనివ్వ‌ని సినిమాలు-వ‌ణికించే మూవీస్‌పై ఓ లుక్కేయండి

ఓటీటీలో హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఓ వైపు భయంతో వణికిస్తూనే, మరోవైపు అదిరిపోయే థ్రిల్ పంచుతాయి. ఇలాంటి మూడు హారర్ థ్రిల్లర్ సినిమాలు లేటెస్ట్ లో ఓటీటీలో అదరగొడుతున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి. 

Dec 7, 2025, 19:04:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో హారర్ థ్రిల్లర్లు ఎప్పుడూ అదరగొడుతూనే ఉంటాయి. ఈ జోనర్లో వచ్చే సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ లో మంచి ఆదరణ దక్కుతుంటుంది. వారం వారం కొత్త హారర్ థ్రిల్లర్లు ఓటీటీలోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా వచ్చాయి. ఇందులో ఈ మూడు హారర్ థ్రిల్లర్లు ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ లతో వచ్చిన ఈ మూవీస్ ఏంటో చూసేయండి.

ఓటీటీలోని హారర్ థ్రిల్లర్లు
ఓటీటీలోని హారర్ థ్రిల్లర్లు

థామా ఓటీటీ

రష్మిక మందన్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ ‘థామా’ ఓటీటీలో అదరగొడుతోంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 2న రిలీజైంది. ఇందులో రక్త పిశాచి బేతాళిగా రష్మిక మందన్న నటించింది. థామాలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కూడా యాక్ట్ చేశారు.

ఒకసారి జర్నలిస్ట్ అయిన హీరో న్యూస్ కవరేజీ కోసం పర్వత ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అతనిపై ఎలుగు బంటి దాడి చేస్తోంది. దాని నుంచి తడ్కా (రష్మిక) అతణ్ని కాపాడుతుంది. ఆ తర్వాత హీరో కూడా బేతాళుడిగా మారతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? చివరికి థామా ఎవరు? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

డీయస్ ఈరే ఓటీటీ

ఇండియాలోనే ఉత్తమ హారర్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకొంటున్న మూవీ ‘డీయస్ ఇరే’. ఈ మలయాళ హారర్ మూవీ అసలైన హారర్ తో ఆడియన్స్ ను వణికిస్తోంది. ఇందులో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించాడు. ఇది డిసెంబర్ 5 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

రోహన్ (ప్రణవ్) క్లాస్ మేట్ కని (నర్తకి) సూసైడ్ చేసుకుంటుంది. ఆ ఫ్యామిలీని పరామర్శించేందుకు రోహన్ వాళ్ల ఇంటికి వెళ్తాడు. కని రూమ్ లో ఉన్న ఓ రెడ్ కలర్ హెయిర్ క్లిప్ ను తీసుకొని తన ఇంటికి వస్తాడు. అప్పటి నుంచే రోహన్ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. ఏదో ఆత్మ తనను వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది.

జటాధర

సుధీర్ బాబు హీరోగా నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ ‘జటాధర’. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్హి సిన్హా దెయ్యంగా నటించింది. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా. జటాధర మూవీ డిసెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.

దెయ్యాలు లేవని నమ్మే ఓ యువకుడికి, ధన పిశాచికి మధ్య జరిగే పోరాటమే జటాధర సినిమా. శివ (సుధీర్ బాబు) ఓ ధైర్యవంతుడైన యువకుడు. దెయ్యాలున్నాయనే ప్రచారం సాగుతున్న రుద్రారం ఊరిలోకి వస్తాడు. అక్కడ నిధులకు కాపలాగా ఓ ధన పిశాచి ఉంటుంది. శివకు, ధన పిశాచికి మధ్య యుద్ధంలో ఎవరు గెలిచారన్నది సినిమాలో చూడాల్సిందే.