ఇవాళ ఓటీటీలోకి రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ.. అయిదు భాషల్లో స్ట్రీమింగ్.. 8 ఐఎండీబీ రేటింగ్
రష్మిక మందన్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీలోకి వచ్చేసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఇవాళ (డిసెంబర్ 5) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల ప్రారంభంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. కథ కూడా ఆయనదే.

ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ
2025లో వరుస సినిమాలతో జోరుమీద ఉంది రష్మిక మందన్న. ఈ ఏడాదిలో ఆమె హీరోయిన్ గా చేసిన అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో చివరిది ది గర్ల్‌ఫ్రెండ్. థియేటర్లో అదరగొట్టిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది ది గర్ల్‌ఫ్రెండ్.
అయిదు భాషల్లో
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. తెలుగు సహా అయిదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 8గా ఉంది. ఇందులో రష్మిక మందన్న భూమా అనే క్యారెక్టర్ ప్లే చేసింది. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్ తదితరులు కూడా నటించారు.
ది గర్ల్‌ఫ్రెండ్ గురించి
ప్రధాన నటీనటులు రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టితో పాటు ది ది గర్ల్‌ఫ్రెండ్ ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి కూడా నటించారు. ఈ చిత్రం ఒక జంట మధ్య అందమైన ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. కానీ దీక్షిత్ పాత్ర దూకుడుగా ఉండటంతో అది విషపూరితంగా మారుతుంది. ఈ చిత్రం విడుదలకు ముందు సానుకూలమైన సమీక్షలను పొందింది. థియేటర్లలోనూ బాగా ఆడింది. ముఖ్యంగా రష్మిక నటనకు చాలా ప్రశంసలు దక్కాయి.
ది గర్ల్‌ఫ్రెండ్ కథ
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ భూమా దేవి (రష్మిక మందన్న), విక్రమ్ (దీక్షిత్ శెట్టి) కథ. ఇది విమెన్ సెంట్రిక్ లవ్ డ్రామా. భూమా దేవి హైదరాబాద్ వచ్చి ఎంఏ లిటరేచర్ చదువుతుంటుంది. ఆమె అమాయకమైన యువతి. తండ్రి (రావు రమేష్) చాటున పెరిగిన అమ్మాయి. కాలేజీలో విక్రమ్ తో స్నేహం, తర్వాత లవ్ భూమా లైఫ్ ను మలుపు తిప్పుతుంది. ఈ ప్రేమలో విక్రమ్ నియంతలా ప్రవర్తించడం, అనుమానపడటం భూమాకు నచ్చదు. ఇది ప్రేమ కాదు, ఒక జైలు అని భావించిన భూమా ఏం చేసింది? ఇందులో అను ఇమ్మాన్యుయేల్ పాత్ర ఏంటీ? అనేది సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












