ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక మందన్న హారర్ థ్రిల్లర్-అందాలతో మెస్మరైజ్-బేతాళిగా నేషనల్ క్రష్-స్ట్రీమింగ్ లో ట్విస్ట్
రష్మిక మందన్న లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన థామా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాలే డిజిటల్ డెబ్యూ చేసిన థామా స్ట్రీమింగ్ లో మాత్రం ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఓటీటీలోకి రష్మిక మందన్న లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వచ్చేసింది. హారర్ థ్రిల్లర్ గా తెెరకెక్కిన ‘థామా’ ఇవాళ (డిసెంబర్ 2) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. రష్మిక మందన్న ఫస్ట్ టైమ్ నటించిన హారర్ థ్రిల్లర్ ఇది. ఇందులో బేతాళి పిశాచిగా నేషనల్ క్రష్ నటించింది. మంగళవారం ఓటీటీలోకి వచ్చిన థామా స్ట్రీమింగ్ లో ఓ ట్విస్ట్ ఉంది.

థామా ఓటీటీ
రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన థామా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ హారర్ థ్రిల్లర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ప్రస్తుతానికి ఇది రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్లు కూడా దీని కోసం రెంట్ చెల్లించాల్సిందే.
థియేటర్ రెస్పాన్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న బేతాళిగా నటించిన థామా మూవీ అక్టోబర్ 21న దీపావళి సందర్భంగా రిలీజైంది. దీన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ రూ.150 కోట్లు. థామా సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ పండితుల అంచనా.
హారర్ యూనివర్స్
బేతాళ కథగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ థామా. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావ్, సత్యరాజ్ తదితరులు నటించారు. ఇది మాడాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన అయిదో సినిమా. ఇందులో స్త్రీ, భేడియా, ముంజ్యా, స్ట్రీ 2 సినిమాలు వచ్చాయి. థామాకు ఆదిత్య సర్పోదర్ డైరెక్టర్.
థామా స్టోరీ
జర్నలిస్ట్ గా పని చేస్తుంటాడు అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా). ఒక రోజు పర్వత ప్రాంతానికి కవరేజ్ కు వెళ్తాడు. అక్కడ ఓ ఎలుగు బంటి దాడి చేస్తుంటే తడ్కా (రష్మిక) వచ్చి కాపాడుతుంది. తడ్కా ఏమో మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న బేతాళ చెందిన పిశాచి. బేతాళ నాయకుడు థామాగా పిలిచే యాక్షసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ)ని గుహలో బంధించి ఉంచుతారు. మరి అలోక్ గుహలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అతను కూడా బేతాళుడిగా మారాడా? మరి తడ్కా కథ ఏంటీ? అన్నది థామా మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


