1500 కోట్లు దాటిన హారర్ కామెడీ యూనివర్స్- రష్మిక మందన్నా థామా 180 కోట్లతో- కేజీఎఫ్, రోహిత్ శెట్టి కాప్ సిరీస్ అవుట్!
రష్మిక మందన్నా బేతాళిగా నటించిన హారర్ కామెడీ సినిమా థామా బాక్సాఫీస్ వద్ద రూ. 180 కోట్లు దాటింది. దీని ద్వారా మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ మొత్తంగా రూ. 1500 కోట్ల కలెక్షన్స్ దాటేసింది. దీంతో కేజీఎఫ్ ఫిల్మ్ సిరీస్, రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ రెండింటి రికార్డ్స్‌ను అవుట్ చేసింది ఎమ్‌హెచ్‌సీయూ.
రష్మిక మందన్నా వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది. రష్మిక హిందీలో నటించిన హారర్ కామెడీ సినిమా థామా. ఇందులో బేతాళిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా చేసిన థామా మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ (MHCU)లో భాగంగా విడుదలైన విషయం తెలిసిందే.

20 రోజుల్లో 180 కోట్లు
అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైన థామాకు రెస్పాన్స్ బాగానే వచ్చింది. థామా సినిమా ఇప్పటికే 20 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది. అంటే వంద కోట్ల క్లబ్‌ను దాటిసే ఇప్పుడు రూ. 200 కోట్ల మార్కు వైపునకు థామా పరుగెడుతోంది.
స్త్రీ సినిమాతో ప్రారంభం
దీంతో మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ బాక్సాఫీస్ వద్ద రూ. 1500 కోట్ల మైలురాయిని దాటేసింది. శ్రద్ధా కపూర్ స్త్రీ మూవీతో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీలో ముంజ్యా, భేడియా, స్త్రీ 2 సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొట్టాయి.
హీరో హీరోయిన్ల పోస్టర్‌తో
దీంతో మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లోని అన్ని సినిమాలు కలిపి రూ. 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సోషల్ మీడియాలో సంస్థ పేర్కొంది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు నటించి స్త్రీ, స్త్రీ 2 నుంచి వరుణ్ ధావన్, కృతీ సనన్‌ల భేడియా, ఆయుష్మాన్ ఖురానా-రష్మిక మందన్నల థామా వరకు ఈ యూనివర్స్‌లోని హీరో హీరోయిన్లతో కూడిన పోస్టర్‌ను షేర్ చేశారు.
1500 కోట్లు దాటిన నాలుగో సిరీస్
బాలీవుడ్‌లో మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌తోపాటు కేజీఎఫ్, బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ తదితర ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇలా 1500 కోట్లు దాటిన నాలుగో సిరీస్‌గా మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నిలిచింది.
ఆ రెండు సిరీస్‌లు అవుట్
అయితే, రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ (రూ. 1411 కోట్లు), యశ్ కేజీఎఫ్ ఫిల్మ్ సిరీస్ (రూ. 1420 కోట్లు)ను మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ అధిగమించింది. కానీ, థామా ఇంకా అగ్రస్థానానికి చాలా దూరంలో ఉంది. ప్రస్తుతం టాప్‌లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఉంది. ఈ సిరీస్ రూ. 3000 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్లను కూడబెట్టింది.
అధికంగా స్త్రీ 2కే
ఇదిలా ఉంటే MHCUలో అత్యంత విజయవంతమైన చిత్రంగా స్త్రీ 2 ఉంది. ఇది గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా రూ. 870 కోట్లకు పైగా కలెక్షన్స్ సంపాదించింది. థామాతోపాటు మరో మూడు మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.
మరో 8 సినిమాలు
ఈ ఫ్రాంచైజీలో ఫ్లాప్ అయిన ఏకైక చిత్రంగా భేడియా నిలిచింది. ఈ సినిమా ప్రశంసలు పొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 95 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇకపోతే మాడాక్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో మరో ఎనిమిది చిత్రాలు ప్రకటించారు. రాబోయే 5 సంవత్సరాలలో ఇవి విడుదల కానున్నాయి.

ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


