ఓటీటీలోకి నిన్న రిలీజైన రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్.. తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి నిన్న (నవంబర్ 7) థియేటర్లలో విడుదలైన రష్మిక మందన్నా తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ది గర్ల్‌ఫ్రెండ్ స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. మరి ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Published on: Nov 8, 2025, 14:40:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే బాలీవుడ్ నుంచి థామా సినిమాతో అలరించింది. ఆ సినిమా హవా పూర్తి కాకముందే మరో తెలుగు మూవీతో సందడి చేసింది బ్యూటిఫుల్ రష్మిక మందన్నా. ఆ సినిమానే ది గర్ల్‍‌ఫ్రెండ్.

ఓటీటీలోకి నిన్న రిలీజైన రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్.. తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్.. తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్

ఈ సినిమాకు హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో హీరోగా దీక్షిత్ శెట్టి, హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటించింది. మరో కీలక పాత్రలో బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కనిపించింది.

అలాగే, నటుడు రావు రమేష్, రోహిణి, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సైతం పలు కీలక పాత్రల్లో అలరించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినడి నిర్మాతలుగా వ్యవహరించి నిర్మించారు.

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ టాక్

హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా ప్రశాంత్ ఆర్ విహారి బీజీఎమ్ కంపోజ్ చేశారు. టీజర్, ట్రైలర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ భారీ అంచనాలతో నిన్న (నవంబర్ 7) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది.

సాధారణ ఆడియెన్స్‌కు చాలా వరకు సినిమా నచ్చిందని చెబుతుంటే రివ్యూవర్స్ యావరేజ్‌గా ఉందంటున్నారు. ఇలా మిశ్రమ స్పందన తెచ్చుకుంటోన్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 10కి 6.8 రేటింగ్ వచ్చింది. అయితే, థియేట్రికల్ రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటనేది క్యూరియాసిటీ కలిగించే అంశం.

ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ స్ట్రీమింగ్

ఈ క్రమంలోనే ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అయితే, రష్మిక క్రేజ్‌ను బట్టి ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జోరుగానే జరిగిందట. ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాకు రూ. 24 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

ది గర్ల్‌ఫ్రెండ్ హిందీ డబ్బింగ్, శాటిలైట్స్ కలిపి రూ. 7 కోట్లు, ఆడియో రైట్స్‌కు రూ. 3 కోట్ల వరకు వచ్చాయని టాక్. ఇక ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమచారం. దాదాపుగా రూ. 14 కోట్లు ఖర్చు చేసి ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.

రష్మిక మందన్నా థామా ఓటీటీ

అంటే, నెట్‌ఫ్లిక్స్‌లోనే ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని అర్థమవుతోంది. సినిమాకు వచ్చే రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్ అన్ని లెక్కలను దృష్టిలో పెట్టుకుని ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రిలీజ్ కానుంది.

ఇక ఇటీవలే రష్మిక మందన్నా నటించిన బాలీవుడ్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ థామా ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఫిక్స్ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో థామా ఓటీటీ రిలీజ్ కానుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ విజయ్ దేవరకొండతో జరిగిందని రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More