పెద్ది సినిమా వచ్చేది ఈ ఓటీటీలోకే.. రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు.. డిజిటల్ రైట్స్ కోసం కళ్లు చెదిరే రేట్!
గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ సత్తాకు ఇది నిదర్శనమంటూ ఫ్యాన్స్ కాలర్లు ఎగరేసుకుంటున్నారు. అతని అప్ కమింగ్ మూవీ పెద్ది సినిమా డిజిటల్ రైట్స్ రికార్డు రేట్ పలకడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
తెలుగు సినిమా లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఆ తర్వాత గ్లింప్స్, ఫస్ట్ లుక్, చికిరి సాంగ్ తో హైప్ ఆకాశానికి తాకేసింది. దీంతో పెద్ది సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది.

పెద్ది ఓటీటీ రైట్స్
సాధారణంగా అయితే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక లేదా రిలీజ్ అయ్యే ముందు ఓటీటీ రైట్స్ కోసం డీల్ జరుగుతుంది. కానీ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాపై ఉన్న భారీ అంచనాల కారణంగా షూటింగ్ ఇంకా మధ్యలోనే ఉండగానే డిజిటల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే రేట్ కూడా అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. పెద్ది ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ దక్కించుకుందని లేటెస్ట్ బజ్.
పెద్ది డిజిటల్ రేట్
రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ పెద్ది సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే డిజిటల్ రైట్స్ రేట్ కూడా అలా పెరిగిపోయిందని తెలిసింది. భారీ డిమాండ్ నేపథ్యంలో పోటీని దాటి నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ హక్కులు దక్కించుందని టాక్. ఇందు కోసం ఏకంగా రూ.130 కోట్లు చెల్లించిందన్నది ట్రేడ్ టాక్. దీనిపై ఇంకా అఫీషియల్ సమాచారం రావాల్సి ఉంది.
రామ్ చరణ్ క్రేజ్
చిరుత సినిమాతో ప్రయాణం మొదలెట్టి ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్. ఆ తర్వాత ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలు కాస్త నిరాశపర్చినా చెర్రీ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇందుకు పెద్ది మూవీ ఓటీటీ రైట్స్ కు దక్కిన రేటే కారణమని ఫ్యాన్స్ తెగ ఖుష్ అయిపోతున్నారు. తమ హీరో రేంజ్ ఇదీ అంటూ కాలర్ ఎగరేసుకుంటున్నారు.
చికిరి హిట్ తో
బుచ్చిబాబు సాన దర్శకత్వంతో పెద్ది మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రామ్ చరణ్ లుక్, గ్లింప్స్ ముందు వైరల్ గా మారాయి. ఆ తర్వాత జాన్వీ కపూర్ లుక్ రిలీజ్ చేశారు. రీసెంట్ గా చికిరి లిరికల్ వీడియో వదిలారు. ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లోనే 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న పాటగా హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. పెద్ది సినిమా 2026 మార్చి 27న రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


