ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, సిరీస్- పాపులర్ వెబ్ సిరీస్ సీజన్ 5- థ్రిలర్లు కూడా!
మరో కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలోకి మరింత సందడి రాబోతుంది. ఈ వారం సినిమాలు, సిరీస్ లు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. వీటిల్లో నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, సిరీస్ పై ఓ లుక్కేయండి.
కొత్త వారం వచ్చిందంటే ఓటీటీలో సందడి మామూలుగా ఉండదు. కొత్త సినిమాలు, సిరీస్ లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు డిజిటల్ స్ట్రీమింగ్ బాట పడతాయి. ఈ వారం కూడా ఇలాంటి సినిమాలు, సిరీస్ లు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. వీటిల్లో ఈ సినిమాలు, సిరీస్ ను మాత్రం ఈ వారం మిస్ కాకుండా చూసేయండి.

జింగిల్ బెల్ హైస్ట్
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఒరిజినల్ ఫిల్మ్ ‘జింగిల్ బెల్ హైస్ట్’. ఇది రాబరీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్. సోఫియా ఓ ఇంటిని కొనుక్కుని, దాన్ని బాగు చేసుకోవాలని చూస్తుంది. కానీ ఓ ఏజెంట్ ఆమెను మోసం చేయడంతో పాటు ఓ విలువైన ఆభరణాన్ని దొంగిలిస్తాడు. మరోవైపు దొంగ మైఖేల్ కూడా అదే ఆభరణాన్ని సొంతం చేసుకోవాలని చూస్తాడు. అప్పుడు సోఫియా, మైఖేల్ కలుస్తారు. మరి వీళ్లు ఆ ఆభరణాన్ని దొంగతనం చేశారా? అన్నది మూవీలో చూడాల్సిందే. జింగిల్ బెల్ హైస్ట్ నవంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5
ఓటీటీలో అత్యంత పాపులర్ సిరీస్ ల్లో స్ట్రేంజర్ థింగ్స్ ఒకటి. అనూహ్యమైన సంఘటనల కారణంగా ఈ సిరీస్ అదిరిపోయే థ్రిల్ పంచుతుంది. ఇప్పుడీ సిరీస్ లో లాస్ట్ సీజన్ అయిన 5వ సీజన్ రాబోతుంది. దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ నవంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. రెండో పార్ట్ డిసెంబర్ 26న, లాస్ట్ ఎపిసోడ్ జనవరి 1, 2026న స్ట్రీమింగ్ అవుతాయి.
సన్నీ సంస్కారి కి తులసి కుమారి
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారి కి తులసి కుమారి. ఇది రెండు జంటల మధ్య లవ్ స్టోరీ. రీసెంట్ గా థియేటర్లలో రిలీజైన సన్నీ సంస్కారి కి తులసి కుమారి మూవీ మిక్స్ డ్ రిజల్ట్ అందుకుంది. ఈ సినిమాలో జాన్వీ మరొకరిని ప్రేమిస్తుంది. వరుణ్ కూడా వేరే అమ్మాయిని లవ్ చేస్తాడు. అయితే జాన్వీ ప్రేమించిన అబ్బాయి, వరుణ్ లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగిందన్నది నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూసేయండి.
ఆర్యన్
తమిళ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఆర్యన్. విష్ణు విశాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ నవంబర్ 28న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. చనిపోయిన వ్యక్తి చేసే హత్యలు అనే కొత్త పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఓ ఫెయిల్డ్ రచయిత సూసైడ్ చేసుకుంటాడు. కానీ అంతకంటే ముందు అయిదు హత్యలు జరుగుతాయని చెప్తాడు. మరి ఈ హత్యలు ఎవరు చేశారన్నది అదిరే సస్పెన్స్, థ్రిల్ ను అందిస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


