నెల రోజుల్లోపే ఓటీటీలోకి మంచు లక్ష్మి సైకలాజికల్ థ్రిల్లర్.. కూతురితో నటించిన మోహన్ బాబు.. మర్డర్ మిస్టరీ
మంచు లక్ష్మి లీడ్ రోల్ ప్లే చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ దక్ష మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మంచు లక్ష్మి తండ్రి మోహన్ బాబు అతిథి పాత్రలో మెరిసిన ఈ మర్డర్ మిస్టరీ నెల రోజుల్లోపై డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
మంచు లక్ష్మి లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘దక్ష-ది డెడ్లీ కాన్స్పిరెసీ’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సినిమాతో మంచు లక్ష్మి తండ్రి మంచు మోహన్ బాబు గెస్ట్ రోల్ లో కనిపించారు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేద్దాం.
ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ (x/AlluSirish)
దక్ష ఓటీటీ
మంచు లక్షి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ దక్ష ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఈ సినిమాను నెల రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇవాళ (అక్టోబర్ 17) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.
నెల రోజుల్లో ఓటీటీ
దక్ష మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైంది. కానీ ఆశించినంతంగా ఆడలేకపోయింది. ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ మూవీని శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్ టైన్మెంట్స్ పై మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మించారు. ఇందులో మంచు లక్ష్మి, మోహన్ బాబు, సముద్ర ఖని, సిద్ధిక్ తదితరులు నటించారు.
దక్ష కథ ఏమిటంటే?
రెండు మర్డర్ మిస్టరీల చుట్టూ సాగే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ దక్ష. దక్ష (మంచు లక్ష్మి) పోలీస్ డిపార్ట్ మెంట్ లో సీఐగా పని చేస్తుంది. హైదరాబాద్ నగరంలోని ఓ కంటైనర్ యార్డులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తాడు. ఆ కేసును దక్ష టేకప్ చేస్తుంది. మరోవైపు అమెరికా నుంచి వచ్చిన ఓ ఫార్మా కంపెనీకి చెందిన వ్యక్తి కూడా ఇలాగే చనిపోతాడు.
రెండు హత్యలు
ఒకే విధమైన గ్యాస్ రిలీజ్ చేసి ఈ ఇద్దరినీ చంపారనే క్లూను కనిపెడుతుంది దక్ష. మరోవైపు దక్ష మీద డాక్యుమెంటరీ తీసేందుకు ట్రై చేస్తున్న జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్) కలెక్ట్ చేసిన సమాచారంలో అదిరే ట్విస్ట్ లు ఉంటాయి. దీంతో ఈ కేసు నుంచి దక్షను తప్పిస్తారు. మరి ఈ కేసు ఏమైంది? అసలు దక్ష పర్సనల్ లైఫ్ ఏంటీ? ఆమె జీవితంలోని నిజాలు ఏంటీ? మోహన్ బాబు గెస్ట్ రోల్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.