ముందుగానే కాంతారా చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్..650 కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ..రిషబ్ శెట్టి తాజా చిత్రం ఎప్పుడు,ఎక్కడ చూడాలంటే?
రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 చిత్రం మీరు అనుకున్నదానికంటే త్వరగా ఆన్ లైన్ లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ మూవీ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ చూసేయండి.
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా పరుగులు పెడుతుంది కాంతార చాప్టర్ 1 మూవీ. 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ కాంతార సినిమాకు ఇది ప్రీక్వెల్. ఇప్పటికే కాంతార చాప్టర్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఇంకా కలెక్షన్ల పెరిగే అవకాశముంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

కాంతార చాప్టర్ 1 ఓటీటీ
కాంతార చాప్టర్ 1 సినిమాకు ప్రేక్షకుల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి తెలుసుకోవాలని పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. ఓటీటీలో కాంతారా చాప్టర్ 1 ను ఎక్కడ, ఎక్కడ చూడాలంటే? పింక్ విల్లా నివేదిక ప్రకారం కాంతారా చాప్టర్ 1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆన్ లైన్ లో ప్రసారం అవుతుంది. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ చిత్రానికి డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
ఓటీటీ డీల్
కాంతార చాప్టర్ 1 ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇందు కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.125 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఇది పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ లో రెండవ అత్యధిక పారితోషికం పొందిన కన్నడ చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో మొదటి ర్యాంకు ఇప్పటికీ యష్ కేజీఎఫ్ 2దే.
తెలుగులోనూ
రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోకి రాబోతుంది. ఓటీటీ ప్లే నివేదిక ప్రకారం ఈ సినిమా 30 అక్టోబర్, 2025 నుండి ఎప్పుడైనా ఓటీటీ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. సాధారణంగా థియేట్రికల్, ఓటీటీ విడుదల మధ్య నాలుగు వారాల విరామం ఉంటుంది. అయితే అన్ని వెర్షన్లు ఒకే తేదీలో విడుదల అవుతాయో లేదో తెలియదు. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ వెర్షన్లు మొదట ఆన్ లైన్ లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
కాంతారా చాప్టర్ 1 హిందీ డబ్బింగ్ వెర్షన్ ఎనిమిది వారాల విరామాన్ని అనుసరించవచ్చు. అయితే ఓటీటీ రిలీజ్ డేట్ ను చిత్ర నిర్మాతలు ఇంకా ధృవీకరించలేదు. కాంతారా చాప్టర్ 1 ను రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య తదితరులు నటించారు.హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగండూర్, చలువేగౌడ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం దేశీయ, అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


