ఓటీటీలోకి తమిళ సర్వైవల్ థ్రిల్లర్.. టన్నెల్ లో ఉండే సైకో గ్యాంగ్.. ట్రాప్ లో పోలీసులు.. 7.1 ఐఎండీబీ రేటింగ్
ఓటీటీలోకి మరో తమిళ థ్రిల్లర్ రాబోతుంది. అథర్వ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన థనల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. తెలుగులో ఇది టన్నెల్ పేరుతో థియేటర్లో రిలీజైంది. దీనికి 7.1 ఐఎండీబీ రేటింగ్ ఉంది.
ఓటీటీలోకి మరో తమిళ సర్వైవల్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో, అదిరే ట్విస్ట్ లతో ఒక రాత్రి ప్రాణం కోసం పోరాడే హీరో కథతో వచ్చిన ‘థనల్’ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఇది ‘టన్నెల్’ పేరుతో తెలుగులో రిలీజైంది. ఈ మూవీలో అథర్వ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో చూద్దాం.

టన్నెల్ ఓటీటీ
తమిళ లేటెస్ట్ క్రైమ్, సస్పెన్స్, సర్వైవల్ థ్రిల్లర్ ‘టన్నెల్’. తల్లి అయిన తర్వాత రిలీజైన లావణ్య త్రిపాఠి తొలి సినిమా ఇదే. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగులోనూ మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది.
తల్లి అయ్యాక
మెగా హీరో వరుణ్ తేజ్ ను లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇటీవల బాబు పుట్టాడు. లావణ్య త్రిపాఠి తల్లి అయిన తర్వాత రిలీజైన ఆమె తొలి సినిమా టన్నెల్. అథర్వ, లావణ్య త్రిపాఠి, అశ్విన్ తదితరులు నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న రిలీజైంది. దీనికి రవీంద్ర మాధవ డైరెక్టర్.
టన్నెల్ కథ
టన్నెల్ మూవీని క్రైమ్, సస్పెన్స్, సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. పోలీసు యూనిఫామ్ వేసుకున్న అందరినీ చంపాలనుకునే సైకో రౌడీ గ్యాంగ్ కు, పోలీసులకు మధ్య పోరాటమే ఈ సినిమా. ఓ బ్యాంకు దొంగతనంతో మూవీ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఆ దొంగతనం చేసిన గ్యాంగ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారు. దీంతో ఆ ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులతో పాటు యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరిని విలన్ గ్యాంగ్ చంపేస్తామంటుంది.
నైట్ టన్నెల్ లో
కొంతమంది పోలీసులను విలన్ గ్యాంగ్ చంపేస్తుంది. మరోవైపు అను (లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడతాడు అఖిల్ (అథర్వ). కానీ ఉద్యోగం లేకుండా ఉన్న అఖిల్ కు అమ్మాయిని ఎలా ఇవ్వాలని అడుగుతాడు అను తండ్రి. దీంతో తన ఫ్రెండ్స్ తో కలిసి కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చుకుంటాడు అఖిల్. అందరికీ ఒకే పోలీస్ స్టేషన్ లోనే పోస్టింగ్ వస్తుంది.
అయితే అఖిల్, ఫ్రెండ్స్ జాయినింగ్ రోజే పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. విలన్ గ్యాంగ్ ట్రాప్ లో పడ్డ వీళ్లు ఒక స్లమ్ లో చిక్కుకుంటారు. మరి వీళ్లు విలన్ నుంచి తప్పించుకున్నారా? ఆ రాత్రి ఏం జరిగింది? టన్నెల్ లో ఏముంది? అన్నది మిగతా కథ.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


