ఓటీటీలోకి ఒక రోజు ముందే మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. తెలుగు సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్
మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే ఓటీటీలోకి వస్తోంది. ఈ విషయాన్ని మూవీని స్ట్రీమింగ్ చేయనున్న సోనీ లివ్ ఓటీటీయే వెల్లడించింది. దృశ్యం డైరెక్టర్ తీసిన థ్రిల్లర్ సినిమా కావడంతో దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి మిరాజ్ (Mirage). నిజానికి దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ అన్ని సినిమాల్లో ఇదే కాస్త బలహీనంగా ఉందన్న టాక్ వచ్చినా.. మొత్తంగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. అయితే అనుకున్నదాని కంటే ఒక రోజు ముందుగానే కావడం విశేషం.

మిరాజ్ ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళ స్టార్ హీరో ఆసిఫ్ అలీ నటించిన మూవీ మిరాజ్. ఇందులో అపర్ణ బాలమురళీ కూడా నటించింది. ఈ మిరాజ్ సినిమాను ముందు చెప్పినదాని కంటే ఒక రోజు ముందే స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ ఓటీటీ బుధవారం (అక్టోబర్ 15) వెల్లడించింది.
“మీకు స్టోరీ తెలుసని అనుకుంటారు.. ఓ ట్విస్ట్ ఎదురైతేగానీ తెలియదు. మిరాజ్ ఒక రోజు ముందుగానే అక్టోబర్ 19న స్ట్రీమింగ్ కానుంది. ఫుల్ ట్విస్టులు, థ్రిల్స్ అందించే ఆదివారం కోసం సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ తో సోనీ లివ్ ట్వీట్ చేసింది.
కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు భాషల్లో మిరాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.1 రేటింగ్ సాధించిన మిరాజ్ మూవీని అక్టోబర్ 19 నుంచి సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.
మిరాజ్ మూవీ గురించి..
దృశ్యం సిరీస్‌తో జీతూ జోసెఫ్ నేషనల్ లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతడు దృశ్యం 3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే అతని డైరెక్షన్ లో వచ్చిన మూవీయే ఈ మిరాజ్. గత నెల 19న థియేటర్లలో రిలీజైంది. ఇందులో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళీ లీడ్ రోల్స్ లో నటించారు. ఇక మిరాజ్ కథ విషయానికొస్తే.. అభిరామి (అపర్ణ బాలమురళి) తన లవర్ కిరణ్ (హకీమ్ షాజహాన్)ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ నుంచి అభిరామికి కాల్ వస్తుంది. దాంతో పీఎస్‌కు వెళ్లిన అభిరామికి కిరణ్ రైలు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. దాంతో షాక్‌లోకి వెళ్తుంది అభిరామి.
ఆ షాక్ నుంచి తేరుకోకముందే అభిరామిని ఓ హార్డ్ డిస్క్ గురించి పోలీస్ నుంచి రౌడీల వరకు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కిరణ్‌ది నిజంగా యాక్సిడెంటా? అభిరామిని అడిగిన హార్డ్ డిస్క్‌లో ఏముంది? అభిరామికి ఎదురైన ప్రమాదం ఏంటీ? దాని నుంచి తప్పించుకుందా? అనేటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిరాజ్ తెరకెక్కింది.
సహజంగానే ఓటీటీల్లో మలయాళం థ్రిల్లర్ సినిమాలకు చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందులోనూ దృశ్యం డైరెక్టర్ థ్రిల్లర్ సినిమా కావడంతో మిరాజ్ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


