కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల విధ్వంసం.. సల్మాన్ టైగర్ 3 లైఫ్‌టైమ్ రికార్డు బ్రేక్.. 13 రోజుల్లోనే ఇంత వసూలు చేసిందా?
కాంతార చాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. ఈ పీరియాడికల్ ఫోక్ థ్రిల్లర్ అంచనాలను దాటి అదరగొడుతోంది. వసూళ్లు వేటలో దూసుకెళ్తూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ 3 లైఫ్ టైమ్ కలెక్షన్లను కాంతార చాప్టర్ 1 దాటింది.
కాంతార చాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. థియేటర్లలో విడుదలై 13 రోజులైనా దూకుడు మాత్రం కొనసాగుతోంది. ఈ మూవీ ఇండియాలో నెట్ కలెక్షన్ల పరంగా రూ.500 కోట్ల మార్కు వైపు దూసుకెళ్తోంది. ఇటీవలి వసూళ్లతో ఈ చిత్రం నటుడు సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించింది.
కాంతార చాప్టర్ 1 పోస్టర్ లో రిషబ్ శెట్టి
కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు
13వ రోజు ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద తన పట్టును నిలుపుకుంది. 13వ రోజు భారతదేశంలో రూ.13.50 కోట్ల నెట్ కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు రిషబ్ శెట్టి సినిమా భారతదేశంలో మొత్తం రూ. 465.25 కోట్ల నికర వసూళ్లను సాధించింది.
ఈ చిత్రం ఇప్పుడు నటుడు విజయ్ సినిమా 'ది గోట్' లైఫ్‌టైమ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లను (ప్రపంచవ్యాప్తంగా రూ.457 కోట్లు) దాటింది. మరోవైపు,'టైగర్ 3' గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద తన లైఫ్‌టైమ్ కలెక్షన్‌గా రూ. 464 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమానూ కాంతార చాప్టర్ 1 బీట్ చేసింది.
భారీ ఓపెనింగ్
'కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1' ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం భారీ సంఖ్యలో ఓపెనింగ్స్ సాధించి, మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి ఇండియాలో రూ.61.85 కోట్లు వసూలు చేసింది. కన్నడ, హిందీ, తెలుగు మార్కెట్ల నుండి బలమైన సహకారం లభించింది. రెండవ రోజు స్వల్పంగా తగ్గినా వారాంతంలో వసూళ్లు పెరిగి, మొదటి ఆదివారం రూ.63 కోట్లకు చేరాయి. మొదటి వారం చివరి నాటికి 'కాంతార' మౌత్ టాక్, పాన్-ఇండియా అప్పీల్‌తో భారతదేశంలో ఏకంగా రూ.337.40 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రెండవ వారంలో కూడా తన విజయ పరంపరను కొనసాగిస్తూ ఇప్పుడు కొత్త మైలురాయి వైపు పయనిస్తోంది.
ఆక్యుపెన్సీ ఇలా
మంగళవారం (అక్టోబర్ 14) 'కాంతార చాప్టర్ 1' అన్ని ప్రాంతాలలో స్థిరమైన ఫుట్‌ఫాల్స్‌ను కొనసాగించింది. ఈ చిత్రం కన్నడలో మొత్తం 29.18% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తన సొంత రాష్ట్రంలో ఉత్తమ ప్రదర్శనను కొనసాగిస్తోంది. హిందీ వెర్షన్ కూడా 26.16% ఆక్యుపెన్సీతో స్థిరమైన ఆదరణను చూపించింది, తమిళ, తెలుగు వెర్షన్లు వరుసగా 20.28%, 16.22% నమోదు చేశాయి. మలయాళ వెర్షన్ థియేటర్లలో 14.43% డీసెంట్ ఆక్యుపెన్సీని చూసింది.
'కాంతార చాప్టర్ 1'కి రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించారు. ఇది 2022 బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వచ్చింది. అసలు సినిమాకు దాదాపు వెయ్యి సంవత్సరాల ముందు సెట్ చేసిన కథ ఇది. భూత కోల ఆచార మూలాల్లోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఈ సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల మార్కును దాటింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా నటించారు. దీనిని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.
News/Entertainment/కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల విధ్వంసం.. సల్మాన్ టైగర్ 3 లైఫ్‌టైమ్ రికార్డు బ్రేక్.. 13 రోజుల్లోనే ఇంత వసూలు చేసిందా?
News/Entertainment/కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల విధ్వంసం.. సల్మాన్ టైగర్ 3 లైఫ్‌టైమ్ రికార్డు బ్రేక్.. 13 రోజుల్లోనే ఇంత వసూలు చేసిందా?