ఓటీటీలోకి జాన్వీ కపూర్ లేటెస్ట్ రొమాంటిక్ మూవీ.. మాజీ లవర్స్ పెళ్లిలో కొత్త ప్రేమ కథ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

జాన్వీ కపూర్ లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంటుందో ఇక్కడ చూసేయండి.  

Published on: Nov 23, 2025, 21:43:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా అక్టోబర్ 2, 2025న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టనుంది.

ఓటీటీలోకి జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ
ఓటీటీలోకి జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ

సన్నీ సంస్కారి కి తులసి కుమారి ఓటీటీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఆమె నటించిన రీసెంట్ మూవీ ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’. ఇందులో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సాన్యా మల్హోత్రా, రోహిత్ సరఫ్ తదితరులు నటించారు. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్ రెస్పాన్స్

ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించి, శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన సన్నీ సంస్కారి కి తులసి కుమారి మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. బలమైన తారాగణం, మంచి ఓపెనింగ్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ప్రభావాన్ని చూపడంలో విఫలమైంది. అక్టోబర్ 2, 2025న ఈ మూవీ రిలీజైంది. ముఖ్యంగా కాంతార చాప్టర్ 1తో పోటీ జాన్వీ సినిమాను దెబ్బకొట్టింది.

బాక్సాఫీస్ కలెక్షన్లు

రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కిన సన్నీ సంస్కారి కి తులసి కుమారి సినిమా వాణిజ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంది. అనేక పరిశ్రమ నివేదికల ప్రకారం దాని ప్రారంభ రోజున సుమారు రూ.9 కోట్లు వసూలు చేసింది. మొదటి వారం చివరి నాటికి బాక్సాఫీస్ వసూళ్లు సుమారు రూ.41.1 కోట్లుగా ఉన్నాయి. చివరకు ఈ మూవీ ఇండియాలో రూ.70 కోట్ల వరకు మాత్రమే ఖాతాలో వేసుకోగలిగింది.

సన్నీ సంస్కారి కి తులసి కుమారి కథ

సన్నీ సంస్కారి (వరుణ్ ధావన్),అనన్య (సాన్యా మల్హోత్రా) లవర్స్. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ తన పేరేంట్స్ ఒత్తిడి కారణంగా అనన్య.. విక్రమ్ (రోహిత్ సరఫ్)తో పెళ్లికి రెడీ అవుతుంది. మరోవైపు తాను ప్రేమించిన తులసి కుమారి (జాన్వీ కపూర్)ను విక్రమ్ వదులుకోవాల్సి వస్తుంది. తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం సన్నీ, తులసి కలిసి విక్రమ్, అనన్య పెళ్లి చెడగొట్టాలనుకుంటారు. కానీ ఈ క్రమంలో సన్నీ, తులసి మధ్య ప్రేమ మొదలవుతుంది.

సన్నీ, తులసి మధ్య కెమిస్ట్రీ కుదురుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? తమ మాజీ లవర్స్ ను వీళ్లు సొంతం చేసుకున్నారా? లేదా సన్నీ, తులసి ఒకటైపోయారా? అన్నది సినిమాలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More