ఓటీటీని ఏలుతున్న తమిళ సినిమాలు-మూడు కొత్త చిత్రాల జోరు-గ్లోబల్ ట్రెండింగ్-ఓ లుక్కేయండి
తమిళ సినిమాలు ఓటీటీని ఏలుతున్నాయి. అదిరిపోయే వ్యూయర్ షిప్ తో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. మూడు తమిళ కొత్త చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతున్నాయి. ఈ మూవీస్ ఏంటో ఓ లుక్కేయండి.
ఓటీటీలోకి రీసెంట్ గా వచ్చిన మూడు తమిళ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతున్నాయి. గ్లోబల్ ట్రెండింగ్ కొనసాగుతున్నాయి. ఈ మూడు మూవీస్ డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కాయి. అవే.. డ్యూడ్, బైసన్, డీజిల్. ఈ మూడు తమిళ సినిమాలు ఇప్పుడు ఓటీటీని ఏలుతున్నాయి. ఇవి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఓ సారి చూసేయండి.

డ్యూడ్ ఓటీటీ
ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీ డ్యూడ్. దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. డ్యూడ్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలో డ్యూడ్ సినిమా గ్లోబల్ ట్రెండింగ్ గా కొనసాగుతోంది. ఇది జెన్ జెడ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన సినిమా. యూత్ ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తున్న మూవీ డ్యూడ్.
బైసన్ ఓటీటీ
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ బైైసన్. ఇది రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన సినిమా. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. చిన్నప్పటి నుంచి కబడ్డీ ప్లేయర్ గా ఎదగాలనే కల కన్న ఓ యువకుడి కథ ఇది. తన ప్రయాణంలో వివక్షను దాటి, అవమానాలను ఎదుర్కొని ఆ కుర్రాడు అనుకున్నది సాధించాడా? లేదా? అన్నది ఇంట్రెస్టింగ్ గా చూపించారు. బైసన్ సినిమా కూడా దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ లో సెకండ్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.
డీజిల్ ఓటీటీ
లేటెస్ట్ గా ఓటీటీలోకి వచ్చిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ డీజిల్ మూవీ. హరీష్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా ఇది. క్రూడ్ ఆయిల్ అక్రమ రవాణా చుట్టూ సాగుతుంది డీజిల్ మూవీ స్టోరీ. డీజిల్ వాసుగా హీరో ఎలా మారాడు? ఆ వ్యాపారమే అతనికి ప్రమాదకరంగా ఎలా మరిందన్నది మూవీలో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్లే అవుతోంది. ఇప్పుడు ఇండియాలో నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది డీజిల్. ఇందులో సాయి కుమార్ కూడా కీ రోల్ ప్లే చేశారు. డ్యూడ్, బైసన్, డీజిల్.. ఈ మూడు సినిమాలనూ ఓటీటీలో తెలుగులోనూ చూడొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


