ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్.. ఓటీటీలోకి వచ్చేసిన డ్యూడ్.. జెన్ జెడ్ రొమాంటిక్ మూవీ

ప్రదీప్ రంగనాథన్ తాజా తమిళ బ్లాక్ బస్టర్ మూవీ డ్యూడ్ ఓటీటీలోకి వచ్చేసింది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ జెన్ జెడ్ రొమాంటిక్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. 

Published on: Nov 14, 2025, 06:04:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ మూవీ డ్యూడ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (నవంబర్ 14) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులో మమితా బైజు హీరోయిన్. ఈ చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.

డ్యూడ్ ఓటీటీ రిలీజ్
డ్యూడ్ ఓటీటీ రిలీజ్

డ్యూడ్ ఓటీటీ

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన జెన్ జెడ్ రొమాంటిక్ మూవీ డ్యూడ్ ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఓటీటీలో డ్యూడ్ మూవీని చూడొచ్చు. ఇందులో ప్రదీప్, మమితా, ఆర్.శరత్ కుమార్, ఐశ్వర్య శర్మ తదితరులు నటించారు. దీనికి కీర్తిశ్వరన్ డైరెక్టర్.

రూ.100 కోట్లు

డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇది రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. లవ్ టుడే, డ్రాగన్ తర్వాత డ్యూడ్ తో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు 2025 లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్ల ఓపెనింగ్ వసూళ్లతో ప్రదీప్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలిచింది డ్యూడ్. దీని స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ .25 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

డ్యూడ్ కథ

అగన్ (ప్రదీప్), కురల్ (మమితా) కజిన్స్. చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ గా ఉంటారు. ఫ్యామిలీలో సందడి చేస్తారు. చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తుంటారు. ఇదే క్రమంలో అగన్ తో ప్రేమలో పడుతుంది కురల్. ప్రపోజ్ చేస్తే అగన్ రిజెక్ట్ చేస్తాడు. కానీ ఆ తర్వాత అగన్ రియలైజ్ అవుతాడు. తాను కూడా కురల్ ను ప్రేమిస్తున్నానని తెలుసుకుంటాడు.

కురల్ ను పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రి అతియమాన్ (శరత్ కుమార్) దగ్గరకు వెళ్లి చెప్తాడు. దానికి అతియమాన్ సంతోషంగా ఒప్పుకొని పెళ్లి అరెంజ్ మెంట్స్ చేస్తాడు. కానీ ఇంతలోనే వేరే క్యాస్ట్ కు చెందిన పారిని లవ్ చేస్తున్నట్లు కురల్ షాక్ ఇస్తుంది. వేరే క్యాస్ట్ అతణ్ని మ్యారేజీ చేసుకున్నందుకు తన చెల్లిని చంపిన అతియమాన్ కూతురు ఇంటర్ కాస్ట్ మ్యారేజీకి ఒప్పుకోడు.

తండ్రిగా

అతియమాన్ పొలిటికల్ ఇన్ ఫ్లూయెన్స్ ను దాటి కురల్, పారిని విదేశాలకు పంపేందుకు అగన్ చాలా ప్రయత్నిస్తాడు. కానీ కురల్ ప్రెగ్నెన్సీ కారణంగా ఆగిపోతారు. కురల్ డెలివరీ అయితే తండ్రి ప్లేస్ లో అగన్ సంతకం చేస్తాడు. ఆ తర్వాత పారి నుంచి కురల్ విడిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది డ్యూడ్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More