అఫీషియల్.. ఆ రోజే ఓటీటీలోకి డ్యూడ్.. 100 కోట్ల జెన్ జెడ్ రొమాంటిక్ మూవీ

సస్పెన్స్ కు తెరపడింది. ప్రదీప్ రంగనాథన్ బ్లాక్ బస్టర్ మూవీ డ్యూడ్ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ జెన్ జెడ్ రొమాంటిక్ మూవీ మరో నాలుగు రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. 

Published on: Nov 10, 2025 9:54 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘డ్యూడ్’ ఓటీటీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ వీడింది. ఈ సినిమా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది ఆ ప్లాట్ ఫామ్. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి, 2025 లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

డ్యూడ్ పోస్టర్ లో ప్రదీప్ రంగనాథన్ (x/Netflix_INSouth)
డ్యూడ్ పోస్టర్ లో ప్రదీప్ రంగనాథన్ (x/Netflix_INSouth)

డ్యూడ్ ఓటీటీ

జెన్ జెడ్ రొమాంటిక్ స్టోరీగా గుర్తింపు తెచ్చుకున్న డ్యూడ్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. నవంబర్ 14 నుంచి డ్యూడ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇవాళ (నవంబర్ 10) వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డ్యూడ్ మూవీ అందుబాటులో ఉండనుంది.

నెల లోపే ఓటీటీలోకి

డ్యూడ్ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 17, 2025న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజ్ జంటగా నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వినిపించింది. లవ్ టుడే, డ్రాగన్ తర్వాత డ్యూడ్ తో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఇప్పుడు నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

డైరెక్టర్ డెబ్యూ

కీర్తిస్వరన్ రచన, దర్శకత్వం వహించిన 'డ్యూడ్' కు మైత్రీ మూవీ మేకర్స్ మద్దతు ఇచ్చింది. ఇది మైత్రీ రెండవ తమిళ నిర్మాణంగా నిలిచింది. ఈ చిత్రంతో కీర్తిస్వరన్ డైరెక్టర్ గా డెబ్యూ చేశాడు. ప్రధాన పాత్రల్లో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజుతో పాటు ఆర్. శరత్‌కుమార్, హ్రిధు హరూన్, రోహిణి, ఐశ్వర్య శర్మ, నేహా శెట్టి తదితరులు నటించారు.

డ్యూడ్ కథ

డ్యూడ్ అనేది ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ. ఆధునిక సంబంధాలను హాస్యం, గందరగోళంతో మిళితం చేస్తుంది. ఈ చిత్రం ప్రదీప్ రంగనాథన్ పోషించిన సరదాగా ఉండే యువకుడు 'డ్యూడ్ ఆగన్' చుట్టూ తిరుగుతుంది. అతను ఊహించని విధంగా ఒక క్లిష్టమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చిక్కుకుంటాడు.

జీవితం అతన్ని గందరగోళం, హృదయ విదారక క్షణాలు, చివరికి రియలైజేషన్ వరకూ తీసుకెళ్తుంది. ఈ మూవీ స్నేహం, మెచ్యూరిటీ, ప్రేమ చిక్కుముడులైన నిజాలను హైలైట్ చేస్తుంది.

బాక్స్ ఆఫీస్ బిజినెస్

డ్యూడ్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సాధించింది. ఫస్ట్ డే రూ.9.75 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే తొలి రోజు ఈ చిత్రం రూ.22 కోట్లు (US$2.6 మిలియన్లు) ఆర్జించింది. ఇది ప్రదీప్‌ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక ఓపెనర్‌గా నిలిచింది. ఓవరాల్ గా దీని వసూళ్లు రూ.100 కోట్లు దాటాయి. డ్యూడ్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

News/Entertainment/అఫీషియల్.. ఆ రోజే ఓటీటీలోకి డ్యూడ్.. 100 కోట్ల జెన్ జెడ్ రొమాంటిక్ మూవీ
News/Entertainment/అఫీషియల్.. ఆ రోజే ఓటీటీలోకి డ్యూడ్.. 100 కోట్ల జెన్ జెడ్ రొమాంటిక్ మూవీ