ఓటీటీలోకి రెండే రోజుల్లో వచ్చిన 7 హారర్ థ్రిల్లర్స్- తెలుగులో 6 స్ట్రీమింగ్- గుండెదడ పెంచేవి 6, నవ్వించే మూవీ ఒక్కటి!

ఓటీటీలోకి రెండే రోజుల్లో ఏకంగా 7 హారర్ థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ ఇలా వివిధ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ తెరకెక్కిన ఈ 7 హారర్ థ్రిల్లర్స్‌లో ఏకంగా 6 సినిమాలు తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఏడింట్లో 6 గుండెదడ పెంచేవయితే ఒక్కటి మాత్రం నవ్విస్తుంది.

Published on: Nov 10, 2025, 05:33:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి రెండే రోజుల్లో ఏకంగా 7 హారర్ థ్రిల్లర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. గురు (నవంబర్ 06), శుక్ర (నవంబర్ 07) వారాల్లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ 7 హారర్ థ్రిల్లర్స్‌లో ఏకంగా 6 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీలోకి రెండే రోజుల్లో వచ్చిన 7 హారర్ థ్రిల్లర్స్- తెలుగులో 6 స్ట్రీమింగ్- గుండెదడ పెంచేవి 6, నవ్వించే మూవీ ఒక్కటి!
ఓటీటీలోకి రెండే రోజుల్లో వచ్చిన 7 హారర్ థ్రిల్లర్స్- తెలుగులో 6 స్ట్రీమింగ్- గుండెదడ పెంచేవి 6, నవ్వించే మూవీ ఒక్కటి!

గుండెదడ పెంచేవి 6- నవ్వించేది ఒక్కటి

అలాగే, క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, అడ్వెంచర్ ఇలా వివిధ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ 7 హారర్ థ్రిల్లర్ మూవీస్‌లో 6 సినిమాలు భయంతో గుండెదడ పెంచేవి ఉన్నాయి. ఒక్క సినిమా మాత్రం కామెడీ అంశాలతో నవ్వించేది ఉంది. మరి ఆ ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ ఏంటీ, వాటి ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందా.

డార్క్ నన్స్ ఓటీటీ

దక్షిణ కొరియాలో హారర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన సినిమా డార్క్ నన్స్. ఒక బాలుడిని రక్షించడానికి ఇద్దరు నన్స్ చేసే ప్రయత్నంగా తెరకెక్కిన డార్క్ నన్స్ ట్విస్టులతో భయపెడుతుంది. జియో హాట్‌స్టార్‌లో నవంబర్ 06 నుంచి తెలుగులో డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

బాంబి ది రికనింగ్ ఓటీటీ

బాంబి ది రికనింగ్ అనేది 2025లో రిలీజ్ అయిన బ్రిటీష్ ఇండిపెండెంట్ హారర్ థ్రిల్లర్ సినిమా. బాంబి అంటే దుప్పి అనే అర్థం వస్తుంది. భయంకరమైన, క్రూరమైన యంగ్ దుప్పి ఇద్దరు తల్లి, కొడుకులపై ఎలా రివేంజ్ తీర్చుకుందనే కథతో ఈ మూవీ సాగుతుంది. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 6న తెలుగులో బాంబి ది రికనింగ్ ఓటీటీ రిలీజ్ అయింది.

హౌజ్‌మేట్స్ ఓటీటీ

తమిళంలో సూపర్ హిట్ అయిన సూపర్ నాచురల్ హారర్ కామెడీ ఫాంటసీ డ్రామా చిత్రమే హౌజ్‌మేట్స్. జీ5 ఓటీటీలో నవంబర్ 7 నుంచి తెలుగు భాషలో హౌజ్‌మేట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఒక్క సినిమా భయపెట్టడం కంటే ఎక్కువగా నవ్విస్తుంది.

కమరో 2 ఓటీటీ

కన్నడ క్రేజీ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన కన్నడ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కమరో 2. స్పైన్ చిల్లింగ్ హారర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే కమరో 2 మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో నవంబర్ 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. భయంతో గుండెదడ పెంచే సినిమాల్లో ఇది ఒకటి.

బారాముల్లా ఓటీటీ

హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతోపాటు ఇన్వెస్టిగేషన్ కూడా కావాలనుకునేవారికి బారాముల్లా మంచి ఛాయిస్. మ్యాజిక్ షోలో మిస్ అయ్యే పిల్లలను వెతికేందుకు చేసే ఇన్వెస్టిగేషన్ కథతో ఇది తెరకెక్కింది. హిందీ హారర్ థ్రిల్లర్ చిత్రమైన బారాముల్లా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నవంబర్ 07 నుంచి తెలుగు భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

ఫ్రాంకెన్‌స్టీన్ ఓటీటీ

హాలీవుడ్‌లో రూపొందిన లేటేస్ట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఫ్రాంకెన్‌స్టీన్. ఊహించని ట్విస్టులతో వణుకుపుట్టించే ఫ్రాంకెన్‌స్టీన్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. నవంబర్ 7న తెలుగు భాషలో నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రాంకెన్‌స్టీన్ ఓటీటీ రిలీజ్ అయింది.

జరణ్ ఓటీటీ

వరుసగా చేతబడులకు గురైన కుటుంబం ఏమైంది అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా జరణ్. నవంబర్ 7 నుంచి జీ5లో తెలుగులో జరణ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అదిరిపోయే ట్విస్టులతో ఈ సినిమా భయపెట్టేలా ఉంటుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More