సుధీర్ బాబు హారర్ థ్రిల్లర్ మూవీకి రూ. 2.91 కోట్ల కలెక్షన్స్.. జటాధర 2 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే!
హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా జటాధర. సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ ముఖ్య పాత్రలు పోషించిన జటాధర సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్సే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో జటాధర సినిమాకు రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా జటాధర. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించిన జటాధర సినిమాకు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ ఇద్దరు దర్శకత్వం వహించారు.

ఊహించిన స్థాయిలో
నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన జటాధర సినిమాకు రెస్పాన్స్ బాగానే ఉంది. అయితే, ఊహించినంత స్థాయిలో మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో జటాధర మూవీ కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. జటాధర సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అంటూ మేకర్స్ తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.
జటాధర వరల్డ్ వైడ్ కలెక్షన్స్
జటాధర సినిమాకు వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో రూ. 2.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. తొలి రోజు జటాధర సినిమాకు రూ. 1.47 కోట్లు వచ్చినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. అలాగే, రెండో రోజున ఈ సినిమాకు రూ. 1.44 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
ఇండియా నెట్ కలెక్షన్స్
ఇలా రెండు రోజులు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా జటాధర సినిమాకు 2.91 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇకపోతే తొలి రోజు ఇండియావ్యాప్తంగా జటాధర సినిమాకు రూ. 1.07 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చిటన్లు తెలుస్తోంది. ఈ కలెక్షన్స్‌లో తెలుగు నుంచి రూ. 85 లక్షలు, హిందీ బెల్ట్ ద్వారా 22 లక్షలు వచ్చాయి. ఇక రెండో రోజున ఇండియాలో రూ. 0.89 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
గత సినిమాల కంటే
అయితే, సుధీర్ బాబు గత సినిమాలతో పోలిస్తే జటాధర కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. జటాధర సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జీ స్టూడియోస్ సమర్పణలో, ప్రేరణ అరోరా జటాధర సినిమాను నిర్మించారు.
జటాధర నటీనటులు
కాగా, జటాధర సినిమాలో సుధీర్ బాబు ఘోస్ట్ హంటర్‌గా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ధన పిశాచిగా భయపెట్టింది. అలాగే, శిల్పా శిరోద్కర్ నెగెటివ్ రోల్ చేసింది. వీరితోపాటు జటాధర సినిమాలో ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
హీరోయిన్‌గా దివ్య ఖోస్లా కుమార్
జటాధర సినిమాలో బ్యూటిఫుల్ దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్‌గా చేసింది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో జటాధార సినిమాను ద్విభాషాలో సూపర్ నాచురల్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందించారు.
జటాధర నిర్మాతలు
జటాధర చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా, దివ్య విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా భవిని గోస్వామి పర్యవేక్షక నిర్మాతగా ఉన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


