ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

డ్యూడ్ అంటూ థియేటర్లకు వచ్చి అదరగొట్టాడు ప్రదీప్ రంగనాథన్. ఈ మూవీతో అతను హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. థియేటర్లలో అదరగొట్టిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వచ్చేస్తుందో చూసేయండి. 

Published on: Oct 29, 2025, 17:30:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

థియేటర్లలో అదరగొట్టిన తమిళ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ ‘డ్యూడ్’ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓటీటీ రిలీజ్ ల్లో ఇది ఒకటి.

డ్యూడ్ మూవీ పోస్టర్ లో ప్రదీప్, మమితా (X)
డ్యూడ్ మూవీ పోస్టర్ లో ప్రదీప్, మమితా (X)

థియేటర్ రెస్పాన్స్

దర్శకుడు కీర్తిశ్వరన్ కోలీవుడ్ అరంగేట్ర చిత్రంగా వచ్చిన డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఈ తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం.. ధ్రువ్ విక్రమ్ 'బైసన్: కాలమాడన్', హరీష్ కళ్యాణ్ 'డీజిల్' వంటి ఇతర చిత్రాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది. అయినా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది.

డ్యూడ్ ఓటీటీ రిలీజ్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ 'డ్యూడ్' సినిమా అధికారిక స్ట్రీమింగ్ హక్కులను పొందింది. మీడియా నివేదికల ప్రకారం ఈ చిత్రం హిందీతో సహా పలు భాషల్లో నవంబర్ 14న ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై మేకర్స్, నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం డ్యూడ్ ఓటీటీ రిలీజ్ ఇదేనని తెలిసింది.

డ్యూడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్

ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం 'డ్యూడ్' భారత బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం రూ. 68.09 కోట్ల నెట్ వసూలు చేసింది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. డిజిటల్ ప్రీమియర్ నాటికి దీని సంపాదన మరింత పెరిగే అవకాశం ఉంది. 'డ్యూడ్' ప్రపంచవ్యాప్త కలెక్షన్ ప్రస్తుతం రూ. 106 కోట్ల గ్రాస్‌గా ఉంది. ఇందులో ఓవర్సీస్ వసూళ్లు రూ. 27.4 కోట్లు.

ఇటీవల ట్విట్టర్‌లో ఒక వీడియో ద్వారా'డ్యూడ్' సినిమాకు వచ్చిన అద్భుతమైన స్పందన పట్ల ప్రదీప్ రంగనాథన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

డ్యూడ్ కథ

“చిన్ననాటి స్నేహితులు అగన్, కురల్ విడదీయరాని బంధాన్ని పంచుకుంటారు. కురల్ ప్రేమ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు, ఆమె సంతోషాన్ని కోరుకుంటూనే ఆమెపై తన దాచిన భావాలను అగన్ ఎలా మేనేజ్ చేసుకున్నాడు’’ అన్నదే క్లుప్తంగా డ్యూడ్ మూవీ కథాంశం.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన డ్యూడ్ చిత్రంతో సాయి అభ్యంక్కర్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. రూ. 25–30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రన్‌టైమ్ 139 నిమిషాలు. ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించగా.. మమితా బైజు, ఆర్ శరత్ కుమార్, హ్రిదు హరూన్, రోహిణి, ఐశ్వర్య శర్మ, ద్రవిడ్ సెల్వం కీలక పాత్రల్లో నటించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More