అమ్మాయితో ముసలాయన పెళ్లి-ఇన్సూరెన్స్ డబ్బు కోసం తండ్రి హత్యకు ప్లాన్‌-ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలోకి కామెడీ థ్రిల్ల‌ర్‌

డైరెక్ట్ గా ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్ మూవీ ఒకటి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. జాబ్ నుంచి రిటైరైన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఓ ముసలాయన. ఇన్సూరెన్స్ డబ్బు కోసం పిల్లలు అతణ్ని చంపాలనుకుంటారు. దీనికి రవిబాబు డైరెక్టర్. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

Published on: Nov 13, 2025 9:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రవిబాబు.. టాలీవుడ్ లో విలక్షణ నటుడుగానే కాకుడా వైవిధ్యమైన సినిమాలు తీసే డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఓటీటీ కోసం ఓ మూవీ తీశాడు రవిబాబు. ‘ఏనుగు తొండం ఘటికాచలం’ అనే వెరైటీ టైటిల్ తో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇవాళే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది.

ఓటీటీలో కామెడీ థ్రిల్లర్ (youtube)
ఓటీటీలో కామెడీ థ్రిల్లర్ (youtube)

ఏనుగు తొండం ఘటికాచలం ఓటీటీ

ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ కామెడీ థ్రిల్లర్ వచ్చేసింది. ఏనుగు తొండం ఘటికాచలం సినిమా గురువారం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి రవిబాబు డైరెక్టర్. ఇందులో టాలీవుడ్ లోని అగ్ర కమెడియన్లు నటించారు.

కామెడీ ఎంటర్ టైనర్

టైటిల్ నే డిఫరెంట్ గా ప్లాన్ చేసి సగం మార్కులు కొట్టేశాడు డైరెక్టర్ రవిబాబు. ఏనుగుతొండం ఘటికాచలం మూవీ పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అయింది. ఈ సినిమాలో నరేష్ వీకే, వర్షిణి సౌందరరాజన్, అలీ, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, కృష్ణ భ‌గ‌వాన్‌ తదితరులు నటించారు. ఈ స్టార్ కాస్ట్ చూస్తేనే ఇది కామెడీ ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది.

ఏనుగు తొండం ఘటికాచలం కథ

ఏనుగు తొండం ఘటికాచలం (వీకే నరేష్) ఒక రిటైర్డ్ ఎంప్లాయి. అతని పించన్ డబ్బుల కోసం కొడుకులు, కూతురు వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇక తండ్రిని చంపితే ఇన్యూరెన్స్ డబ్బులు తీసుకొవచ్చనే ప్లాన్ వేస్తారు. మరోవైపు తాను మళ్లి పెళ్లి చేసుకుంటానని ఘటికాలం షాకిస్తాడు. తనకంటే ఎంతో వయసు తక్కువైన అమ్మాయి (వర్షిణి)ని పెళ్లి చేసుకుంటాడు.

పెళ్లి తర్వాత కొన్ని రోజులకు ఘటికాలం కనిపించకుండా పోతాడు. నాన్న ఎక్కడా? అని పిల్లలు వెతుకుతారు. చనిపోయిన వ్యక్తికి ఇన్యూరెన్స్ తీసుకోవచ్చా అని ప్రయత్నిస్తారు. ఈ సందర్భంగా వచ్చే కామెడీ కడుపుబ్బా నవ్వించేలా ఉంది. మరి చివరకు ఘటికాచలం ఎక్కడున్నాడు? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

ఒరిజినల్ మూవీ

ఈటీవీ విన్ వరుసగా ఒరిజినల్ సిరీస్, సినిమాలతో ఓటీటీలో రచ్చ లేపుతోంది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్, ఏఐఆర్, కానిస్టేబుల్ కనకం సిరీస్ లు.. అనగనగా, లిటిల్ హార్ట్స్ సినిమాలతో అదరగొట్టింది ఈటీవీ విన్. ఇదే క్రమంలో ఇప్పుడు మరో ఒరిజినల్ మూవీని రిలీజ్ చేసింది. ఫుల్ కామెడీ జానర్ లో ఏనుగు తొండం ఘటికాచలం సినిమాను తీసుకొచ్చింది.

రవి బాబు సినిమాలు

ఏనుగు తొండం ఘటికాచలం సినిమాకు రవిబాబు డైరెక్టర్ కావడం విశేషం. అల్లరి నుంచి మొదలు పార్టీ, నచ్చావులే, అమరావతి, మనసారా, అవును, అదుగో, ఆవిరి, క్రష్ లాంటి సినిమాలకు రవిబాబు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఎన్నో తెలుగు సినిమాల్లోనూ నటించాడు. ఇప్పుడు ఆయన ఈటీవీ విన్ కోసం ఏనుగుతొండం ఘటికాచలం మూవీ తెరకెక్కించాడు. స్టోరీ కూడా ఆయనదే.

News/Entertainment/అమ్మాయితో ముసలాయన పెళ్లి-ఇన్సూరెన్స్ డబ్బు కోసం తండ్రి హత్యకు ప్లాన్‌-ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలోకి కామెడీ థ్రిల్ల‌ర్‌
News/Entertainment/అమ్మాయితో ముసలాయన పెళ్లి-ఇన్సూరెన్స్ డబ్బు కోసం తండ్రి హత్యకు ప్లాన్‌-ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలోకి కామెడీ థ్రిల్ల‌ర్‌