జియోహాట్‌స్టార్‌లోకి కొత్తగా వచ్చిన ఈ థ్రిల్లర్లు చూశారా? ఓటీటీలో వణికించే హారర్, యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలో థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఏ భాషలోని థ్రిల్లర్ అయినా డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో ఇలాంటి థ్రిల్లర్లు రెండు కొత్తగా యాడ్ అయ్యాయి. ఆ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి.
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో కొత్త థ్రిల్లర్లు అదరగొడుతున్నాయి. ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. ఇందులో ఒకటేమో వణికించే హారర్ థ్రిల్లర్ ‘ది హోమ్’ కాగా, మరొకటి యాక్షన్ థ్రిల్లర్ ‘ది రౌండప్: పనిష్మెంట్’. ఈ రెండు థ్రిల్లర్లు ఇప్పుడు ఓటీటీలో హాట్ టాపిక్ గా మారాయి. వీటిపై మీరూ ఓ లుక్కేసి థ్రిల్ పొందండి.

ఓటీటీ థ్రిల్లర్లు
ఓటీటీలో ఎప్పటికప్పుడూ థ్రిల్లర్లు వస్తూనే ఉన్నాయి. వీటిలో హారర్, సూపర్ నేచురల్, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, యాక్షన్, రొమాంటిక్.. ఇలా డిఫరెంట్ జోనర్లుంటున్నాయి. ప్రతి జోనర్ లోని థ్రిల్లర్ మాత్రం ఆడియన్స్ ను అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో జియోహాట్‌స్టార్‌లోని రెండు థ్రిల్లర్లు అదరగొడుతున్నాయి.
జియోహాట్‌స్టార్
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. ఇలా రీసెంట్ గా ‘ది హోమ్’, ‘ది రౌండప్’ సినిమాలు యాడ్ అయ్యాయి. ఇందులో ది హోమ్ ఏమో హారర్ థ్రిల్లర్, ది రౌండప్ ఏమో యాక్షన్ థ్రిల్లర్. ఈ రెండు ఇంగ్లీష్ సినిమాలు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ది హోమ్ కథ
ది హోమ్ మూవీ అనేది సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. దీనికి జేమ్స్ డిమొనాకో డైరెక్టర్. ఇది 2025, జులై 25న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో పీట్ డేవిడ్సన్, జాన్ గ్లోవర్, బ్రూస్ తదితరులు నటించారు. ఈ మూవీ కచ్చితంగా ఆడియన్స్ ను భయపెడుతుంది.
మ్యాక్స్ ఓ గ్రాఫిటీ ఆర్టిస్ట్. అతణ్ని ఓ ఇంట్లో ఉంచుతాడు తండ్రి. అక్కడ నాలుగో అంతస్తులోకి మాత్రం వెళ్లొద్దంటాడు. కానీ ఆ ఇంట్లో విచిత్ర సంఘటనలు జరగడం మ్యాక్స్ గమనిస్తాడు. అనాథ పిల్లల కంట్లో నుంచి ఫ్లుయిడ్ తీసుకుని జీవిత కాలాన్ని పొడిగించుకుంటున్నారనే నిజాన్ని కనిపెడతాడు మ్యాక్స్. మరి ఆ తర్వాత ఏం జరిగింది? దీని వెనుక ఉన్నది ఎవరు? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ది రౌండప్:పనిష్మెంట్
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడనే రూమర్లు వస్తున్న కొరియన్ యాక్టర్ డాన్ లీ కీ రోల్ ప్లే చేసిన మూవీ ‘ది రౌండప్:పనిష్మెంట్’. ఈ మూవీ 2024లోనే థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు జియోహాట్ స్టార్ లో అదరగొడుతోంది. దీనికి హియో యుంగ్ డైరెక్టర్. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ముఠాను ఛేదించేందుకు సైబర్ ఎక్స్ పెర్ట్ తో కలిసి హీరో పని చేస్తాడు. మరి చివరకు ఏం జరిగిందన్నది సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


