ఓటీటీలోకి వచ్చిన కొరియన్ హారర్ థ్రిల్లర్- పిల్లాడికి పట్టిన దెయ్యంతో ఇద్దరు నన్స్ పోరాటం- తెలుగులోనే స్ట్రీమింగ్!
ఓటీటీలోకి రీసెంట్‌గా సౌత్ కొరియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ డార్క్ నన్స్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఓ పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని వదిలించుకుందేకు పోరాటం చేసే ఇద్దరు నన్స్ చుట్టూ ఈ కథ సాగుతుంది. భయపెట్టే సీన్లతో తెలుగులో వచ్చిన డార్క్ నన్స్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. డిఫరెంట్ ఎలిమెంట్స్‌తో వివిధ జోనర్స్‌ను యాడ్ చేస్తూ మరి తెరకెక్కించే ఈ హారర్ సినిమాలను చూసేందుకు ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే ప్రతి వారం సరికొత్తగా ఈ ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి.

పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని
అయితే, గత వారం ఏకంగా 7 వరకు హారర్ థ్రిల్లర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో భయపెడుతూ, ఊహించని ట్విస్టులతో సాగే మిస్టరీ హారర్ థ్రిల్లర్ సినిమా ఒకటి ఉంది. అదే డార్క్ నన్స్. ఇది ఒక సౌత్ కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఓ పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని వదిలించేందుకు దుష్ట శక్తితో ఇద్దరు నన్స్ పోరాటం చేస్తుంటారు.
సంగ్ హు క్యో, జియోన్ యో బీన్ ఇద్దరు నన్స్‌గా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు క్వోన్ హియోక్ జేయి దర్శకత్వం వహించారు. జిమ్ సినిమా ప్రొడక్షన్ కంపెనీపై నెక్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ డిస్ట్రిబ్యూషన్‌లో డార్క్ నన్స్ సినిమా విడుదలైంది. సౌత్ కొరియాలో జనవరి 24న థియేటర్లలో విడుదలైంది.
డార్క్ నన్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్
ఆ తర్వాత డార్క్ నన్స్ ఫిబ్రవరి 13న వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. దాంతో బాక్సాఫీస్ వద్ద 12 మిలియన్ యూఎస్ డాలర్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. గంట 54 నిమిషాల రన్‌టైమ్ ఉన్న డార్క్ నన్స్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 5.2 రేటింగ్ మాత్రమే దక్కింది.
ఇలాంటి డార్క్ నన్స్ ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 6 నుంచి డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో డార్క్ నన్స్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, జియో హాట్‌స్టార్‌లో తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగులో చూడాలనుకునేవారికి
అయితే, డార్క్ నన్స్ ట్రైలర్, కనిపించే సీన్స్ మాత్రం ఇంటెన్సివ్‌గా హారిఫిక్‌గా భయపెట్టేలా ఉన్నాయి. స్టోరీని పెద్దగా ట్రైలర్‌లో రివీల్ చేయలేదు. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు తెలుగులో చూడాలనుకుంటే ఈ డార్క్ నన్స్‌ను ట్రై చేయొచ్చు.
ఇక డార్క్ నన్స్ కథ విషయానికొస్తే.. సిస్టర్ జునియా, సిస్టర్ మిచెల్లా ఇద్దరు నన్స్ ఉంటారు. దుష్ట శక్తి పూనిని హీ జూన్ అనే పిల్లాడిని కాపాడేందుకు ఇద్దరు ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ పిల్లాడిని వదిలి దెయ్యం వెళ్లదు. ఎన్నో ప్రాంతాలు, ఎంతోమందిని కలిసి ఆ దెయ్యం గురించి తెలుసుకుని వదిలించేందుకు ఇద్దరు నన్స్ పోరాటం చేస్తుంటారు.
డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్
మరి ఆ దెయ్యాన్ని జునియా, మిచెల్లా వదిలించారా? ఆ పిల్లాడినే ఆ దుష్ట శక్తి ఎందుకు పట్టి పీడించింది? అసలు ఆ దెయ్యం ఎవరు? దానివల్ల వచ్చే ప్రమాదం, ఆపద ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న హారర్ థ్రిల్లర్ డార్క్ నన్స్ చూడాల్సిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


