ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 15 సినిమాలు- కచ్చితంగా చూడాల్సినవిగా 13- హారర్ థ్రిల్లర్ టు ఫ్యామిలీ డ్రామా, ఆహా టు ప్రైమ్!

ఓటీటీలోకి గత వారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో కచ్చితంగా చూడాల్సినవిగా 13 మూవీస్ ఉన్నాయి. వీటిలో ఎక్కువగా హారర్ థ్రిల్లర్స్ ఉన్నాయి. ఈటీవీ విన్, ఆహా, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5లలో తెలుగు ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

Published on: Nov 10, 2025, 12:49:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఏకంగా 15 సినిమాలు తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు స్ట్రయిట్ సినిమాల నుంచి ఇతర భాషల డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఈటీవీ విన్, ఆహా, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సినిమాలపై లుక్కేద్దాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 15 సినిమాలు- కచ్చితంగా చూడాల్సినవిగా 13- హారర్ థ్రిల్లర్ టు ఫ్యామిలీ డ్రామా, ఆహా టు ప్రైమ్!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 15 సినిమాలు- కచ్చితంగా చూడాల్సినవిగా 13- హారర్ థ్రిల్లర్ టు ఫ్యామిలీ డ్రామా, ఆహా టు ప్రైమ్!

ఈటీవీ విన్ ఓటీటీ

ప్రొద్దుటూరు దసరా (తెలుగు కల్చరల్ డాక్యుమెంటరీ చిత్రం)- నవంబర్ 07

విజయ్ కేరాఫ్ రామారావు (తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా)- నవంబర్ 09

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మిత్ర మండలి (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 06

బాంబి ది రికనింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 06

మ్యాక్స్‌టన్ హాల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ జర్మన్ టీనేజ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 07

జియో హాట్‌స్టార్ ఓటీటీ

బ్యాడ్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ తమిళ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 04

ది ఫెంటాస్టిక్ 4: ఫస్ట్ స్టెప్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 05

డార్క్ నన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 06

జీ5 ఓటీటీ

జరణ్ (తెలుగు డబ్బింగ్ మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ)-నవంబర్ 07

హౌజ్‌మేట్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం)- నవంబర్ 7

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

డెత్ బై లైటెనింగ్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ ఎపిక్ పొలిటికల్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 06

బారాముల్లా (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 07

ఫ్రాంకెన్‌స్టీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 07

చిరంజీవ (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ కామెడీ చిత్రం)- ఆహా ఓటీటీ- నవంబర్ 07

అర్జున్ చక్రవర్తి (తెలుగు బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- నవంబర్ 07

తెలుగులో 15 సినిమాలు

ఇలా గత వారం (నవంబర్ 03 నుంచి నవంబర్ 09) తెలుగు భాషలో ఏకంగా 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కచ్చితంగా చూడాల్సిన సినిమాలుగా జరణ్, చిరంజీవ, అర్జున్ చక్రవర్తి, బారాముల్లా, డార్క్ నన్స్, హౌజ్‌మేట్స్, బ్యాడ్ గర్ల్, మిత్ర మండలి సినిమాలు ఉన్నాయి.

కచ్చితంగా చూడాల్సినవి

వీటితోపాటు బాంబి ది రికనింగ్, ది ఫెంటాస్టిక్ 4, ఫ్రాంకెన్‌స్టీన్, విజయ్ కేరాఫ్ రామారావు, ప్రొద్దుటూరు దసరాతో కలిపి కచ్చితంగా చూడాల్సిన స్పెషల్ మూవీస్‌గా 13 ఉన్నాయి.

మరింత ఇంట్రెస్టింగ్

వీటిలో మరింత ఇంట్రెస్టింగ్‌గా స్ట్రయిట్ తెలుగు సినిమాలు అయిన మిత్ర మండలి, చిరంజీవ, విజయ్ కేరాఫ్ రామారావు, ప్రొద్దుటూరు దసరా వంటి 4 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More