ఓటీటీలోకి ది గర్ల్ ఫ్రెండ్.. 2025లో రిలీజైన రష్మిక మందన్న సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా? లుక్కేయండి
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ భామ హీరోయిన్ గా చేసిన సినిమాల్లో 2025లో అయిదు రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో మిగిలిన సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి.
2025లో రష్మిక మందన్న హీరోయిన్ గా చేసిన అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 5 మూవీస్ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటాయి. ఆమె రీసెంట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో 2025లో థియేటర్లో రిలీజైన రష్మిక మందన్న సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేయండి.

ఛావా
ఛావా సినిమాతో 2025ను గ్రాండ్ గా స్టార్ట్ చేసింది రష్మిక మందన్న. విక్కీ కౌశల్ శంభాజీగా నటించిన ఈ పీరియాడికల్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రంలో యశుబాయిగా రష్మిక తన యాక్టింగ్ తో అలరించింది. ఇది ఫిబ్రవరి 14, 2025న థియేటర్లో రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
సికందర్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో రష్మిక మందన్న కలిసి నటించిన మూవీ సికందర్. ఇదో యాక్షన్ థ్రిల్లర్. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ హిందీ మూవీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అయినా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇందులో సల్మాన్ తో కలిసి రష్మిక యాక్షన్ తో సత్తాచాటింది. ఇది మార్చి 30, 2025న థియేటర్లో రిలీజైంది. ఇప్పుడు సికందర్ సినిమాను కూడా నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
కుబేర
ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ మూవీ కుబేర. దీనికి శేఖర్ కమ్ముల డైరెక్టర్. లక్ష కోట్ల కుంభకోణం కథతో వచ్చింది ఈ సినిమా. తెలుగు, తమిళంలో రూపొందిన కుబేర సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో అమాయక అమ్మాయిగా తన నటనతో మెప్పించింది రష్మిక మందన్న. కుబేర సినిమా జూన్ 20, 2025న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ యూజర్లకు అందుబాటులో ఉంది.
థామా
రష్మిక మందన్న బేతాళ రాక్షసిగా నటించిన మూవీ థామా. ఇది హారర్ థ్రిల్లర్. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న రొమాన్స్ అదిరిపోయింది. వీళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ అక్టోబర్ 21, 2025న థియేటర్లో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకుంది. ఇప్పుడు థామా ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ మూవీ డిసెంబర్ 2 తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.
ది గర్ల్ ఫ్రెండ్
రష్మిక మందన్న లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఇది నవంబర్ 7, 2025న థియేటర్లలోకి వచ్చింది. దీనికి రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. ఇందులో దీక్షిత్ శెట్టి, రష్మిక, అను ఇమ్మాన్యుయేల్ తదితరులు నటించారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 5 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


