అనుపమ పరమేశ్వరన్ సినిమా నుంచి ఎల్ వరకు.. ఈ వారం ఓటీటీలోని మలయాాళ చిత్రాలు.. లిస్ట్ లో థ్రిల్లర్లు.. వీకెండ్ కు బెస్ట్

ఈ వారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ వచ్చింది. ఎప్పటిలాగే డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇందులో మలయాళం సినిమాల వాటా ఎక్కువే. మరి ఈ వీకెండ్ కు ఓటీటీలో చూడాల్సిన మలయాళం సినిమాలపై ఓ లుక్కేయండి. 

Published on: Nov 29, 2025, 18:09:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి మలయాళం సినిమాలు దూసుకొచ్చాయి. ఇందులో కొన్ని డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఉన్నాయి. ఇందులో థ్రిల్లర్లు కూడా ఉత్కంఠ పంచేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వీకెండ్ కు ఈ మలయాళ సినిమాలను చూసేయండి. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసిన సినిమా కూడా ఉంది.

ఓటీటీలోని మలయాళం సినిమాలు (youtube)
ఓటీటీలోని మలయాళం సినిమాలు (youtube)

ది పెట్ డిటెక్టివ్

ఈ వారం ఓటీటీ సినిమాల్లో ఎక్కువ మంది మాట్లాడుకున్న మలయాళం మూవీ ఏదైనా ఉంది అంటే.. అది ది పెట్ డిటెక్టివ్. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, షరాఫుద్దీన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఇది నవంబర్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పెద్ద డిటెక్టివ్ కావాలనుకునే యువకుడి కథ ఇది. ప్రేమించిన అమ్మాయి తండ్రిని ఇంప్రెస్ చేయడం కోసం పెంపుడు జంతువు మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తుంటాడు. అది పెద్ద మాఫియా వరకూ వెళ్తుంది.

ఎల్

ఎల్ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ హారర్ థ్రిల్లర్. కేరళలోని వివిధ ప్రాంతాలలో మహిళలు అనుమానాస్పద మరణాలకు గురవుతున్నారని గమనించే ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి రేణుక చుట్టూ తిరుగుతుంది. ఆమె త్వరలోనే 1980లలో హంగేరీ, ఇతర దేశాల కేసులతో కొన్ని సారూప్యతలను కనుగొంటుంది. ఇందులో విష్ణు, అమృత మీనన్, బిగ్ బాస్-ఫేమ్ సంధ్య మనోజ్ తదితరులు నటించారు. ఇది నవంబర్ 28 నుంచి జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

లవ్ ఎఫ్ఎమ్

రొమాంటిక్ కామెడీ జోనర్లో వచ్చిన మరో మలయాళం సినిమా ‘లవ్ ఎఫ్ఎమ్’. రేడియో జాకీ (ఆర్జే)గా పని చేసే ఓ యువకుడి జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత ఆ యువకుడి లైఫ్ ఎలాంటి మలుపు తిరిగిందనే కథతో లవ్ ఎఫ్ఎమ్ తెరకెక్కింది. ఇందులో అశ్విన్ విజయన్, మౌమితా జయచంద్రన్, ఆషిక్ ముస్లియాన్ తదితరులు నటించారు. ఇది సింప్లీ సౌత్, సైనా ప్లే ఓటీటీల్లో ఉంది.

తాళ్

తాళ్ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇందులోనూ ఫ్యామిలీ డ్రామా కూడా మిక్స్ చేశారు. అభయ్ అనే యువకుడు తన ఉద్యోగం, పర్సనల్ లైఫ్ లో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటాడు. ఇది అతని ఫ్యామిలీ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇది మనోరమా మ్యాక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. తాళ్ సినిమాలో సంకీర్త్ గోపీ, అనూప్ శివసేనన్, షెరిన్ తదితరులు నటించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More