ఓటీటీని ఊపేస్తున్న తమిళ సినిమా-ఈ జనరేషన్ భార్యాభర్తలు చూడాల్సిన మూవీ-ఆన్ పావమ్ పొల్లతత్తు రివ్యూ

రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఓ తమిళ సినిమా అదరగొడుతోంది. ఈ మూవీ గురించి డిస్కషన్ జోరుగానే సాగుతోంది. దీంతో ట్రెండింగ్ లో సాగుతున్న ఆ సినిమా పేరే ఆన్ పావమ్ పొల్లతత్తు. ఈ మూవీ ఎలా ఉందో ఇక్కడ రివ్యూలో చూసేద్దాం.  

Published on: Nov 29, 2025 4:49 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో తమిళ సినిమా ‘ఆన్ పావమ్ పొల్లతత్తు’ అదరగొడుతోంది. ఈ మూవీ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో గూగుల్ ట్రెండింగ్ లో ఈ మూవీ కొనసాగుతోంది. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 28) ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఆన్ పావమ్ పొల్లతత్తు మూవీ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది.

ఆన్ పావమ్ పొల్లతత్తు రివ్యూ (x)
ఆన్ పావమ్ పొల్లతత్తు రివ్యూ (x)

ఆన్ పావమ్ పొల్లతత్తు ఓటీటీ

ప్రస్తుత జనరేషన్ భార్యాభర్తల జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే సినిమానే ఆన్ పావమ్ పొల్లతత్తు. ఇది శుక్రవారం ఓటీటీలోకి వచ్చింది. జియోహాట్‌స్టార్‌ లో ఈ తమిళ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై మంచి రిజల్ట్ అందుకున్న ఈ ఫిల్మ్ ఎలా ఉందో ఇక్కడ రివ్యూలో చూద్దాం.

ఆన్ పావమ్ పొల్లతత్తు కథ

ఇద్దరు వేర్వేరు కుటుంబాలు, వేర్వేరు బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లు పెళ్లి చేసుకుంటే వాళ్ల జీవితం ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే ఆన్ పావమ్ పొల్లతత్తు. శివ (రియో రాజ్)ది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఉద్యోగం చేస్తుంటాడు. మరోవైపు శక్తి (మాళవిక మనోజ్) ఇంటర్ పాస్ కావడానికే తెగ కష్టపడుతుంటుంది. వీళ్లిద్దరికీ పెద్దలు పెళ్లి చేస్తారు.

కొత్త కాపురం

శివ, శక్తి పెళ్లయ్యాక వేరు కాపురం పెడతారు. భార్య అంటే బానిస కాదు, మహిళకు స్వేచ్ఛ ఉండాలని నమ్మే వ్యక్తి శివ. శక్తిని అతను అర్థం చేసుకుంటాడు. కానీ ఆమెకు రీల్స్ పిచ్చి ఉంటుంది. సోషల్ మీడియాతో టైమ్ గడుపుతుంది. ఈ క్రమంలోనే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఓ సందర్భంలో మెడలోని తాళి తీసేస్తుంది శక్తి. ఇద్దరూ విడాకుల కోసం కోర్టుకు వెళ్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది సినిమాలో చూసి తెలుసుకోవాలి.

ఈ జనరేషన్ కపుల్స్

చిన్న విషయాలకే భార్యాభర్తలు గొడవలు పెట్టుకోవడం, విడాకులు తీసుకోవడం, చంపడం లేదా చనిపోవడం లాంటి ఘటనలు ఇప్పుడు చాలానే జరుగుతున్నాయి. ఈ జనరేషన్ భార్యాభర్తల్లో ఓపిక అనేది ఉండటం లేదు. సోషల్ మీడియా ప్రభావం కారణంగా మరింతగా దిగజారిపోతున్నారు. సరిగ్గా ఈ పాయింట్ ఆధారంగానే ఆన్ పావమ్ పొల్లతత్తు సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ కలైరాసన్ తంగవేల్. కపుల్స్ మధ్య హక్కుల గొడవ కంటే కూడా ప్రేమ ఉండాలని చాటే చిత్రమిది.

మనసును తాకేలా

ఈ తరం భార్యాభర్తలకు కనెక్ట్ అయ్యే సినిమా ఆన్ పావమ్ పొల్లతత్తు. పెళ్లి తర్వాత అమ్మాయి, అబ్బాయి కుదురుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. కానీ ఆ లోపే గొడవలు పెట్టుకోవడం సరికాదని ఈ సినిమా చాటుతుంది. ఈ మెసేజ్ జనాల్లోకి వెళ్లడంతో హీరోగా రియో రాజ్, హీరోయిన్ గా మాళవిక మనోజ్ గొప్పగా యాక్ట్ చేశారు. ఈగోలను పక్కనపెడితే ప్రతి ఇంట్లోనూ వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉండొచ్చనేది ఈ సినిమాతో చెప్పారు.

News/Entertainment/ఓటీటీని ఊపేస్తున్న తమిళ సినిమా-ఈ జనరేషన్ భార్యాభర్తలు చూడాల్సిన మూవీ-ఆన్ పావమ్ పొల్లతత్తు రివ్యూ
News/Entertainment/ఓటీటీని ఊపేస్తున్న తమిళ సినిమా-ఈ జనరేషన్ భార్యాభర్తలు చూడాల్సిన మూవీ-ఆన్ పావమ్ పొల్లతత్తు రివ్యూ