ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి వ‌చ్చిన హార‌ర్ థ్రిల్ల‌ర్‌.. బలి తీసుకునే స్విమ్మింగ్ పూల్‌.. భ‌యంతో వ‌ణికించే సినిమా

ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి వణికించే హారర్ థ్రిల్లర్ ఒకటి వచ్చేసింది. స్విమ్మింగ్ పూల్ లో దెయ్యం, ఫ్యామిలీని వెంటాడే సీన్లు, ఉత్కంఠతో ఈ మూవీ మంచి థ్రిల్ ను పంచనుంది. ఓ లుక్కేయండి. 

Nov 19, 2025, 09:21:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్లు చూసే ఫ్యాన్స్ ఉంటారు. ఊపేసే ఉత్కంఠ, వణికించే భయం, అదిరిపోయే సస్పెన్స్ తో ఈ సినిమాలు థ్రిల్ పంచుతాయి. ఇవాళ (నవంబర్ 19) జియోహాట్‌స్టార్‌లోకి అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. ఆ సినిమానే ‘నైట్ స్విమ్’. బుధవారం నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ హారర్ థ్రిల్లర్.

జియోహాట్‌స్టార్‌లో హారర్ థ్రిల్లర్
జియోహాట్‌స్టార్‌లో హారర్ థ్రిల్లర్

నైట్ స్విమ్ ఓటీటీ

ఓటీటీలోకి ఎన్నో హారర్ థ్రిల్లర్లు వస్తున్నాయి. ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేసిన హారర్ థ్రిల్లర్లు ఉన్నాయి. ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి వచ్చిన నైట్ స్విమ్ కూడా అలాంటి సినిమానే. ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ ఫిల్మ్ ఇంగ్లీష్ తో పాటు హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక గంటా 38 నిమిషాల టైమ్ తో ఉన్న నైట్ స్విమ్ హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కు మంచి ఆప్షన్.

ఇప్పటికే ఓటీటీలో

బ్రైస్ మెక్గ్వెర్ డైరెక్షన్ లో వచ్చిన నైట్ స్విమ్ మూవీ ఇప్పటికే ఇతర ఓటీటీల్లో ఉంది. ఈ హారర్ థ్రిల్లర్ 2024, జనవరి 5న థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో (రెంట్)లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి వచ్చిన నైట్ స్విమ్ మూవీలో వ్యాట్ రసెల్, కెర్రీ కాండాన్ తదితరులు నటించారు. సుమారు రూ.132 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. రూ.485 కోట్లు వసూలు చేసింది.

నైట్ స్విమ్ కథ

1992లో రెబెకా అనే అమ్మాయి రాత్రి తన ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్తుంది. అందులోని తన తమ్ముడు బొమ్మను తీయాలని చూస్తుంది. కానీ రెబెకాను పూల్ లోకి ఎవరో లాగుతారు. కట్ చేస్తే ఇప్పుడు బేస్ బాల్ కెరీర్ నుంచి రిటైరవుతాడు రే. తన భార్య ఈవ్, పిల్లలు ఇజ్జీ, ఎలియట్ తో కలిసి కొత్త ఇంటి కోసం వెతుకుతాడు.

స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇంటిని రే కుటుంబం కొనుక్కుంటుంది. కానీ ఆ తర్వాత విచిత్ర ఘటనలు జరుగుతాయి. ఇజ్జీ, ఎలియట్ ను ఎవరో పూల్ లో లాగుతారు. రే విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఇదంతా చూసి ఈవ్ అసలు విషయాన్ని కనుక్కుంటుంది. ఆ పూల్ ఏది అడిగినా ఇస్తుందని కానీ అందుకు ఒకరిని ముందు బలి తీసుకుంటుందని తెలుస్తుంది. మరి పూల్ లో ఉన్న దెయ్యం ఏంటీ? రే కుటుంబంలో బలైంది ఎవరు? తెలియాలంటే నైట్ స్విమ్ మూవీ చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More