ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఫార్మా మాఫియా హత్యల చుట్టూ తిరుగుతూ..
తమిళం నుంచి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. ఫార్మా మాఫియా హత్యల చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ తో ఇది సాగనుంది. స్ట్రీమింగ్ తేదీని కూడా జీ5 ఓటీటీ అనౌన్స్ చేసింది.
తమిళం నుంచి త్వరలో రాబోతున్న కొత్త వెబ్ సిరీస్ 'రేఖై'. ఈ సిరీస్ ప్రముఖ క్రైమ్ రచయిత రాజేష్ కుమార్ నవల ఆధారంగా రూపొందించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్, స్ట్రీమింగ్ తేదీ రివీల్ అయ్యాయి. జీ5 ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఆ వివరాలేంటో చూడండి.

'రేగాయ్' ఓటీటీ రిలీజ్ డేట్
తమిళ వెబ్ సిరీస్ 'వేడువన్' విడుదల తర్వాత జీ5 ఓటీటీ తన తదుపరి తమిళ ఒరిజినల్ సిరీస్ అయిన 'రేఖై' (Regai)ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ నవంబర్ 28న ప్రీమియర్ కానుంది. ఓటీటీప్లే ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు కూడా ఈ షోను చూడొచ్చు. ప్రముఖ క్రైమ్ రచయిత రాజేష్ కుమార్ నవల ఆధారంగా దీనిని రూపొందించడం విశేషం.
'రేఖై' అంటే వేలిముద్రలు అని అర్థం. ఈ సిరీస్ నిజం, నేరం అనే ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్లుగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. బాలహాసన్ ఎస్ఐ వెట్రి పాత్రలో, పవిత్ర జనని కానిస్టేబుల్ సంధ్యగా ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.
ఐస్ ముక్కల మధ్య తెగిన చేయి.. అసలు కథ ఇదే!
ఒక ఐస్-కార్ట్ విక్రేత ప్రమాదవశాత్తు మరణించడంతో ఈ కథ మొదలవుతుంది. పోలీసుల దర్యాప్తులో భాగంగా.. కరుగుతున్న ఆ ఐస్ ముక్కల మధ్య ఒక తెగిపడిన చేతిని ఎస్ఐ వెట్రి గుర్తిస్తాడు. ఆ ఒక్క క్లూ అతన్ని ఊహించని మలుపులు తిప్పుతుంది. సాధారణ కేసు అనుకున్నది కాస్తా మెడికల్ ట్రయల్స్ అనే భయంకరమైన విషవలయంలోకి వెట్రిని నెట్టేస్తుంది.
ఈ కేసు విచారణలో వెట్రికి అడుగడుగునా దిగ్భ్రాంతికరమైన నిజాలు ఎదురవుతాయి. ఒక ప్రశ్నకు సమాధానం దొరికినట్లే అనిపించి.. అంతలోనే మరో చీకటి కోణం బయటపడుతుంది. ఇక్కడ ప్రాణాలతో బయటపడిన ప్రతి ఒక్కరూ ప్రమాదకరంగానే కనిపిస్తారు. చివరకు వేటాడేది ఎవరు? వేటకు గురవుతోంది ఎవరు? అనే గీత చెరిగిపోయేంత ఉత్కంఠభరితంగా ఈ కథ సాగుతుంది.
ఆసక్తి రేపుతున్న ట్రైలర్
ఇటీవలే ‘రేఖై’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. నాలుగు వేర్వేరు హత్యల నేపథ్యం, వాటి వెనుక ఉన్న మిస్టరీని వివరిస్తూ సాగే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. పైకి ఇవి ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా కనిపిస్తాయి. కానీ లోతుగా విచారిస్తే.. దీని వెనుక ఉన్న మెడికల్ మాఫియా కుట్ర వెలుగులోకి వస్తుంది.
ప్రముఖ రచయిత రాజేష్ కుమార్ నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఏ క్రైమ్ కథ అయినా కాగితంపైకి ఎక్కకముందే, మనిషి ఆలోచనల్లో పుడుతుంది. ఒక చిన్న పాయింట్‌ను తీసుకొని, సమాజంలోని చీకటి కోణాలను ‘రేఖై’లో చూపించిన తీరు నాకు నచ్చింది. నా రచనను వేరొకరు తమ కోణంలో ఆవిష్కరించినప్పుడు అందులో కొత్త భయాన్ని సృష్టించినప్పుడు.. ఆ జానర్ ఇంకా బతికే ఉందనిపిస్తుంది" అని చెప్పుకొచ్చారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


