ఈ వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరూ చూడాలి.. ఈకాలం రాజకీయాలకు అద్దం పట్టింది: అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ వైరల్

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఓ వెబ్ సిరీస్ తెగ నచ్చేసింది. దీనిని ప్రతి ఒక్కరూ చూడాలని రికమెండ్ చేస్తున్నారు. ఈ కాలం రాజకీయాలను కళ్లకు కట్టినట్లుగా ఈ సిరీస్ ఉందని ఆయన అన్నారు.

Published on: Nov 17, 2025, 19:22:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటి హుమా ఖురేషి ప్రధాన పాత్ర పోషించిన ‘మహారాణి సీజన్ 4’కు ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన లభిస్తోంది. ఈ సీజన్‌లోనూ ఆమె రాణి భారతిగా తిరిగి వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పాలించి, జాతీయ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగే క్రమాన్ని చూపిస్తుంది. నవంబర్ 7న సోనీ లివ్ ఓటీటీలో విడుదలైన ఈ షోపై.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన రివ్యూ ఇచ్చారు.

ఈ వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరూ చూడాలి.. ఈకాలం రాజకీయాలకు అద్దం పట్టింది: అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ వైరల్
ఈ వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరూ చూడాలి.. ఈకాలం రాజకీయాలకు అద్దం పట్టింది: అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ వైరల్

అరవింద్ కేజ్రీవాల్ రివ్యూ ఇలా..

మహారాణి వెబ్ సిరీస్ నాలుగో సీజన్ కు మొదటి మూడు సీజన్లలాగే అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజానికి ఈ కొత్త సీజన్ మరింత ఉత్కంఠ రేపేలా ఉందని రివ్యూ ఇస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై రివ్యూ ఇచ్చారు.

కేజ్రీవాల్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ఈ సిరీస్‌ను చూడాలని కోరారు. "మీరు తప్పక సోనీ లివ్ లో మహారాణి 4 వెబ్‌సిరీస్‌ని చూడాలి. ఇది నేటి రాజకీయాల వికృత వాస్తవాన్ని చూపిస్తుంది. ధైర్యం చూపినందుకు మొత్తం బృందానికి అభినందనలు" అని ట్వీట్ చేశారు.

మహారాణి సీజన్ 4 గురించి..

మహారాణి నుంచి ఇప్పటికే మూడు సీజన్లు రాగా.. అన్నింటికీ పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఇప్పుడు నాలుగో సీజన్ కూడా చాలా ఉత్కంఠ రేపేలా సాగింది. ఈ ఫిక్షనల్ డ్రామా బీహార్‌లోని వాస్తవ సంఘటనల (ముఖ్యంగా 1990లలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవిని వారసురాలిగా నియమించిన సంఘటన) నుండి ప్రేరణ పొందింది.

'మహారాణి సీజన్ 4'లో రాణి భారతి ఒక కుంభకోణం కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. ఆ స్థానంలో తన కూతురు రోష్ని (శ్వేతా బసు ప్రసాద్)ని కొత్త ముఖ్యమంత్రిగా నియమిస్తుంది. ఇది బంధుప్రీతి ఆరోపణలకు దారి తీయడంతోపాటు ఆమె పెద్ద కొడుకుతో సహా పార్టీ సభ్యుల నుండి వ్యతిరేకత తీసుకొస్తుంది.

ఈ కొత్త సీజన్ లో రాణికి అతి పెద్ద సమస్యగా ప్రధానమంత్రి (విపిన్ శర్మ) మారుతాడు. ఆమెను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రధాని ప్రయత్నించడం, ఈ రెండు శక్తుల మధ్య జరిగే పోరాటమే 'మహారాణి సీజన్ 4' ప్రధాన కథాంశం. ఈ సిరీస్ క్రియేటర్ సుభాష్ కపూర్. ఈ సీజన్‌ను సుభాష్ కపూర్, నందన్ సింగ్, ఉమాశంకర్ సింగ్ రాశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More