నెట్‌ఫ్లిక్స్‌లో హారర్ థ్రిల్లర్ మూవీ దూకుడు.. ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు ఇవే

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ మూవీ బారాముల్లా దూసుకెళ్తోంది. గత వారం అంటే నవంబర్ 10 నుంచి 16 మధ్య ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ 5 సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ఇందులో కాంతారా ఛాప్టర్ 1 తొలి స్థానంలో కొనసాగుతోంది.

Published on: Nov 17, 2025, 21:05:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెట్‌ఫ్లిక్స్‌లో ఈమధ్యే వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ బారాముల్లా. కశ్మీర్ నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా దూకుడు కొనసాగిస్తోంది. గత వారం ఓటీటీలో ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. మరి వీటిలో టాప్ 5లో ఉన్న సినిమాలు ఏవో చూడండి.

నెట్‌ఫ్లిక్స్‌లో హారర్ థ్రిల్లర్ మూవీ దూకుడు.. ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు ఇవే
నెట్‌ఫ్లిక్స్‌లో హారర్ థ్రిల్లర్ మూవీ దూకుడు.. ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు ఇవే

టాప్ 5 సినిమాలు ఇవే

ఓటీటీలో గతవారం అంటే నవంబర్ 10 నుంచి 16 మధ్య ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా సోమవారం (నవంబర్ 17) రిలీజ్ చేసింది. వీటిలో కాంతార ఛాప్టర్ 1 మూవీ మరోసారి టాప్ లో నిలిచింది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచీ ఈ సినిమా తొలి రెండు స్థానాల్లోనే ఉంటూ వస్తోంది. గతవారం 3.3 మిలియన్ వ్యూస్ తో ఈ సినిమా టాప్ లో నిలవడం విశేషం. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

హారర్ థ్రిల్లర్ దూకుడు

ఇక నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా అడుగుపెట్టిన హారర్ థ్రిల్లర్ మూవీ బారాముల్లా. ఈ సినిమా రెండో స్థానంలో నిలిచింది. గతవారం ఈ మూవీకి 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మానవ్ కౌల్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా కశ్మీర్ లోని బారాముల్లా టౌన్ లో అమ్మాయిల మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది.

జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న అత్యధిక వసూళ్ల మలయాళ సినిమా లోకా ఛాప్టర్ 1 చంద్ర మూడో స్థానంలో ఉంది. ఈ సినిమాకు గత వారం 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కు వచ్చిన మరో మూవీ జాలీ ఎల్ఎల్‌బీ 3. గత వారం ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర రూ.170 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.

జియోహాట్‌స్టార్ లోకి వచ్చిన హాలీవుడ్ మూవీ ది ఫెంటాస్టిక్ ఫోర్ సినిమా ఐదో స్థానంలో ఉంది. దీనికి గత వారం 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ లెక్కన టాప్ 5లో ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ ఓటీటీల్లోని సినిమాలు నిలిచాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More