విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటా.. అతని కోసం బుల్లెట్ కు ఎదురెళ్తా: రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్లు
విజయ్ దేవరకొండతో పెళ్లి పుకార్లు వస్తున్న నేపథ్యంలో రష్మిక మందన్న తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో వివరించింది. అతని కోసం బుల్లెట్ కు ఎదురు వెళ్తానని కూడా చెప్పింది.
విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ జరిగిందనే వార్తలతో ఇటీవల నటి రష్మిక మందన్న హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. ఈ ఊహాగానాల మధ్య హానెస్ట్ టౌన్‌హాల్‌తో జరిగిన ఒక క్యాంపస్ సంభాషణలో రష్మిక తనకు కాబోయే భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో వివరించింది. అలాగే తను ఇప్పటివరకు పనిచేసిన నటులలో ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కూడా వెల్లడించింది.

విజయ్ తో పెళ్లి
ఇప్పటివరకు పనిచేసిన నటులలో ఎవరిని చంపుతారు, పెళ్లి చేసుకుంటారు, డేట్ చేస్తారని రష్మిక మందన్నను ప్రశ్న అడిగారు. రష్మిక తాను నరుటో (అనిమే క్యారెక్టర్)తో డేట్ చేస్తానని, విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆమె సమాధానానికి ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే విజయ్ తో ఎంగేజ్మెంట్ అయిన నేపథ్యంలో రష్మిక కామెంట్లు వైరల్ గా మారాయి.
బుల్లెట్ కు ఎదురెళ్తా
తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాలను వివరించింది రష్మిక. “నిజాయితీగా చెప్పాలంటే, నన్ను లోతుగా అర్థం చేసుకోగల వ్యక్తి నాకు కావాలి. నేను సాధారణంగా చెప్పడం లేదు. జీవితాన్ని తన సొంత దృక్కోణం నుంచి అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. అతను కొన్ని పరిస్థితులను ఎలా చూస్తాడు? అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి కావాలి. నిజంగా మంచివాడై, నాతో కలిసి లేదా నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి. రేపు నాపై ఏదైనా యుద్ధం వస్తే, ఆ వ్యక్తి నాతో కలిసి పోరాడతాడని నాకు తెలియాలి. నేను కూడా అదే చేస్తాను. అతని కోసం నేను ఏ రోజైనా తూటాను ఎదుర్కొంటాను. అలాంటి వ్యక్తి నాకు కావాలి” అని రష్మిక చెప్పింది.
ఉదయ్‌పూర్‌కు వెళ్లి
రష్మిక ఇప్పటికే పెళ్లి పనులను వేగంగా ప్రారంభించిందని ఒక సోర్స్ హెచ్‌టీకి తెలిపింది. ఆమె ఇటీవల ఉదయ్‌పూర్‌కు వెళ్లి “ఘనమైన వేడుక” కోసం కొన్ని వేదికలను పరిశీలించినట్లు సమాచారం. ఇదే సమయంలో విజయ్ సన్నిహిత వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. “ఈ జంట వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు” అని, ఫిబ్రవరిలో జరగబోయే వేడుకకు ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయని సూచించారు.
రష్మిక, విజయ్ లవ్
2018లో వచ్చిన హిట్ చిత్రం ‘గీత గోవిందం’, ఆ తర్వాత 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’లో కలిసి పనిచేసినప్పటి నుంచి రష్మిక, విజయ్ డేటింగ్‌లో ఉన్నారని పుకార్లు వస్తున్నాయి. ఈ జంట తరచుగా కలిసి సమయం గడుపుతూ కనిపించారు. వారు తమ సంబంధాన్ని ఎప్పుడూ ధృవీకరించనప్పటికీ, అభిమానులు మాత్రం వారు ఒకే రకమైన హాలిడే లొకేషన్ల నుంచి ఫోటోలు పంచుకోవడాన్ని గమనించి, ఊహాగానాలకు మరింత బలం చేకూర్చారు.
2024లో విజయ్, రష్మిక ఇద్దరూ తాము సింగిల్ కాదని ధృవీకరించారు, కానీ తమ భాగస్వాముల పేర్లను వెల్లడించలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగిందని విజయ్ టీమ్ హెచ్‌టీకి ధృవీకరించింది. ఆ తర్వాత కొద్దికాలానికే రష్మిక తన పెంపుడు కుక్కతో ఉన్న ఒక క్యూట్ వీడియోలో తన ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని చూపిస్తూ కనిపించింది. అయినప్పటికీ, ఈ జంట నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఇంకా ఎదురుచూస్తున్నారు.













