ఈ వారం ఓటీటీలో అదరగొడుతున్న తమిళ రిలీజ్ లు.. ఈ సినిమా, సిరీస్ లు చాలా స్పెషల్.. అన్నీ క్రైమ్ థ్రిల్లర్లే
ఈ వారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ చాలానే వచ్చింది. ఇందులో తమిళ రిలీజ్ ల వాటా ఎక్కువ. తమిళ సినిమాలు, సిరీస్ లు కూడా ఎక్కువగానే వచ్చాయి. అయితే వీటిలో ఈ రెండు వెబ్ సిరీస్ లు, ఓ సినిమా మాత్రం స్పెషల్ గా ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.
ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్ ల సందడి కొనసాగుతోంది. ఓటీటీలు వచ్చాక ఇతర భాషల కంటెంట్ ను కూడా తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి తమిళ సినిమాలు, సిరీస్ లు వచ్చేశాయి. వీటిల్లో ఈ రెండు సిరీస్ లు, ఓ సినిమా చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఈ మూడు క్రైమ్ థ్రిల్లర్లే. కేవలం ఓటీటీలో మాత్రమే వీటిని చూడొచ్చు.

స్టీఫెన్
సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ స్టీఫెన్. ఇది తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజైంది. ఫేక్ ఆడిషన్స్ తో తొమ్మిది మంది అమ్మాయిలను చంపిన సీరియల్ కిల్లర్ స్టోరీ ఇది. ఆ తర్వాత హంతకుడు లొంగిపోతాడు. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ లు భలే ఉత్కంఠను పంచుతాయి. ఇందులో గోమతి శంకర్, మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్, విజయశ్రీ తదితరులు నటించారు. ఇది డిసెంబర్ 5న ఓటీటీలో రిలీజైంది.
కుట్ర పురిందవన్
కుట్ర పురిందవన్ ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తన కుమార్తెపై దాడి జరిగిన తర్వాత న్యాయం కోసం పోరాడే తండ్రి కథను చెబుతుంది. ఈ 8 ఎపిసోడ్‌ల సిరీస్ భావోద్వేగ లోతుతో పాటు ఉత్కంఠను రేకెత్తిస్తుంది. దీనికి సెల్వమణి మునియప్పన్ డైరెక్టర్. ఇందులో పశుపతి, లక్ష్మీ ప్రియా చంద్రమౌళి, విదార్థ్ తదితరులు నటించారు. ఇది డిసెంబర్ 5 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్
హైదరాబాద్ నేపథ్యంలో సాగే ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ వెబ్ సిరీస్ తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ వెబ్ సిరీస్ తన వినూత్న పద్ధతులకు పేరుగాంచిన పోలీసు అధికారి, అతని డెస్క్‌కు వచ్చే అసాధారణ కేసులను అనుసరిస్తుంది. ఈ ప్రాంతంలో రెండు హత్యలు కలకలం రేపుతాయి. పోలీసులు ఎలాగైనా కేసును ఛేదించాలి.
చైతన్య సాగిరాజు, కంచరపాలెం రాజు, శివనారాయణ నారిపెడ్డి తదితరులు నటించిన ఈ సిరీస్ అదరగొడుతోంది. ఇది డిసెంబర్ 5న రిలీజైంది. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఇది అందుబాటులో ఉంది. ఇది 50 ఎపిసోడ్ల వెబ్ సిరీస్. ప్రతి వారం రాత్రి 7 గంటలకు ఒక కొత్త ఎపిసోడ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


