తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి

ఓటీటీలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఒక రోజు ముందే వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఓ పాప మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది. గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

Published on: Dec 4, 2025, 21:03:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి లేటెస్ట్‌గా వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్. నిజానికి శుక్రవారం (డిసెంబర్ 5) స్ట్రీమింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఒక రోజు ముందే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి
తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి

కుట్రమ్ పురింధవన్ ఓటీటీ స్ట్రీమింగ్

క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఓటీటీలో ఉన్న డిమాండ్ నేపథ్యంలో తరచుగా చాలా వరకు వెబ్ సిరీస్ ఈ జానర్లోనే తెరకెక్కిస్తుంటారు. అలా తమిళం నుంచి వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే ఈ కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్. ఈ సిరీస్ ను సోనీ లివ్ (Sony Liv) ఓటీటీలో చూడొచ్చు. గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. సెల్వమణి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో పశుపతి, విదార్థ్, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళిలాంటి వాళ్లు నటించారు.

కుట్రమ్ పురింధవన్ వెబ్ సిరీస్ కథ ఇదీ..

కుట్రమ్ పురింధవన్ వెబ్ సిరీస్ ఓ పాప మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది. సిరీస్ మొదట్లోనే ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండటం, అతని 12 ఏళ్ల కూతురు కనిపించకుండాపోవడం చూడొచ్చు. ఆ వ్యక్తికి సాయం చేయాలని చూసి భాస్కర్ (పశుపతి) అనే వ్యక్తి ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటాడన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.

చేసిన తప్పు దాచి పెట్టలేనంత పెద్దది అనే క్యాప్షన్ ఈ పోస్టర్ పై ఉంచడం చూస్తుంటే.. పాప మిస్సింగ్ కేసు వెనుక ఉన్న మిస్టరీ ఎలాంటిదన్నది ఊహించుకోవచ్చు. ఈ కుట్రమ్ పురింధవన్ వెబ్ సిరీస్ లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. 35 నుంచి 40 నిమిషాల నిడివితో ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ ను అవినాష్ హరిహరణ్, అరబ్బి ఆత్రేయ, సెంథిల్ వీరసామి నిర్మించారు. ఈ సిరీస్ ను తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళంలలోనూ తీసుకురావడంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More