ఓటీటీలోకి ఫ్రీగా వచ్చేస్తోన్న హారర్ కామెడీ థామా- రెంట్ లేకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్- రక్త పిశాచిగా రష్మిక మందన్నా!

ఓటీటీలోకి ఎలాంటి రెంటల్ విధానం లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది థామా మూవీ. రష్మిక మందన్నా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ థామా ఓటీటీ రిలీజ్ అయిన నేపథ్యంలో అద్దె ప్రాతిపదికన కాకుండా సబ్‌స్క్రిప్షన్‌తో వీక్షించే వెసులుబాటును కల్పించనుంది సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్. ఆ వివరాల్లోకి వెళితే..!

Published on: Dec 4, 2025, 15:10:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ చిత్రం 'థామా'. మాడాక్ ఫిలిం ఫ్రాంచైజీ నుంచి వచ్చిన థామా ఓటీటీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఓటీటీలోకి ఫ్రీగా వచ్చేస్తోన్న హారర్ కామెడీ థామా- రెంట్ లేకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్- రక్త పిశాచిగా రష్మిక మందన్నా!
ఓటీటీలోకి ఫ్రీగా వచ్చేస్తోన్న హారర్ కామెడీ థామా- రెంట్ లేకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్- రక్త పిశాచిగా రష్మిక మందన్నా!

రెంటల్ విధానంలో

డిసెంబర్ 02 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో థామా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం రెంట్ పద్ధతిలో థామా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో అందరూ ప్రేక్షకులు థామాను ఓటీటీలో చూసేందుకు వీలు లేకుండా పోయింది.

థామా ఓటీటీ రిలీజ్

ఈ క్రమంలోనే థామా ఫ్రీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉచితంగా థామాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. అంతేకాకుండా థామా ఫ్రీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించిందట అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.

డిసెంబర్ 16 నుంచి

డిసెంబర్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లందరికీ ఉచితంగా థామా అందుబాటులోకి రానుంది. అంటే, డిసెంబర్ 16 నుంచి థామా సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సబ్‌స్క్రైబర్స్ అందరూ ఎలాంటి రెంట్ చెల్లించకుండా ఫ్రీగా వీక్షించవచ్చు.

రూ. 349 చెల్లించి

అయితే, రెంట్ వర్సెస్ ఉచితం విషయానికొస్తే.. థామాను ప్రస్తుతం 'ఎర్లీ యాక్సెస్' పద్ధతిలో ప్రైమ్ వీడియో అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 2 నుంచే ఈ సేవలు మొదలయ్యాయి. థామాను ఓటీటీలో ఇప్పుడే చూడాలనుకునే వారు రూ. 349 చెల్లించి రెంట్ పద్ధతిలో వీక్షించవచ్చు.

48 గంటల్లోపే చూడాలి

ఒక్కసారి రెంట్ తీసుకున్న తర్వాత, థామా సినిమాను చూడడం ప్రారంభించడానికి మీకు 30 రోజుల గడువు ఉంటుంది. కానీ, ఒక్కసారి 'ప్లే' బటన్ నొక్కాక మాత్రం 48 గంటల్లోపు సినిమాను చూడాల్సి ఉంటుంది. డిసెంబర్ 16 నుంచి ఇలాంటి విధానం లేకుండా ఫ్రీగా థామాను ఓటీటీలో చూసేయొచ్చు.

థామా బడ్జెట్

అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా థామా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే, రూ. 140 కోట్లతో నిర్మాణంతోపాటు ప్రమోషన్ ఖర్చులను కలిపి థామా సినిమాకు మొత్తం రూ. 150 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. మాడాక్ బ్యానర్ చరిత్రలోనే ఇది కాస్ట్‌లీ సినిమా. ఇక థామా సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 211 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

రక్త పిశాచిగా రష్మిక

ఇదిలా ఉంటే, థామా సినిమాలో రష్మిక మందన్నా బేతాళ జాతికి చెందిన రక్త పిశాచిగా నటించింది. థామా సినిమాను లవ్, రొమాన్స్, కామెడీ, ఫాంటసీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More