ఓటీటీలోకి రష్మిక మందన్నా రొమాంటిక్ థ్రిల్లర్ ది గర్ల్‌ఫ్రెండ్- 5 రోజుల్లో 5 భాషల్లో స్ట్రీమింగ్- 8.2 రేటింగ్

ఓటీటీలోకి రష్మిక మందన్నా రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ స్ట్రీమింగ్ కానుంది. ఇవాళ (నవంబర్ 30) ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మరో 5 రోజుల్లో 5 భాషల్లో ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రిలీజ్ కానుంది. మరి ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 30, 2025, 12:46:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోయింది. పుష్ప 2 హిట్ తర్వాత హిందీలో హారర్ కామెడీ మూవీ థామాతో అలరించింది. అనంతరం తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ తెరకెక్కింది.

ఓటీటీలోకి రష్మిక మందన్నా రొమాంటిక్ థ్రిల్లర్ ది గర్ల్‌ఫ్రెండ్- 5 రోజుల్లో 5 భాషల్లో స్ట్రీమింగ్- 8.2 రేటింగ్
ఓటీటీలోకి రష్మిక మందన్నా రొమాంటిక్ థ్రిల్లర్ ది గర్ల్‌ఫ్రెండ్- 5 రోజుల్లో 5 భాషల్లో స్ట్రీమింగ్- 8.2 రేటింగ్

రష్మిక మందన్నాకు జోడీగా

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రష్మిక మందన్నాకు జోడీగా దీక్షిత్ శెట్టి హీరోగా చేశాడు. అలాగే, మరో బ్యూటిపుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యూయెల్ కీలక పాత్ర పోషించింది. వీరితోపాటు రావు రమేష్, రోహిణి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా నటించారు.

భారీ అంచనాలతో రిలీజ్

గీత ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలకు వ్యవహరించారు. మ్యూజిక్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న థియేటర్లలో భారీ అంచనాల నడుమ విడుదల అయింది.

యూనిక్ స్టోరీగా పేరు

అయితే, ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొన్ని వర్గాలకు మూవీ అంతగా రుచించలేదు. కానీ, యూనిక్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. కానీ, ఐఎమ్‌డీబీ నుంచి మాత్రం ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ పదికి 8.2 రేటింగ్ సాధించుకుంది. అంటే చాలా వరకు ఆడియెన్స్‌కు ది గర్ల్‌ఫ్రెండ్ బాగా నచ్చిందని తెలుస్తోంది.

మరో ఐదు రోజుల్లో

ఇదిలా ఉంటే, తాజాగా ఇవాళ (నవంబర్ 30) ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మరో ఐదు రోజుల్లో ఐదు భాషల్లో ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రిలీజ్ కానుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ ప్రీమియర్ కానుంది.

ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రిలీజ్

నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5 నుంచి ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నట్లు తాజాగా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ది గర్ల్‌ఫ్రెండ్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని ఎంచక్కా చూసేయొచ్చు.

ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రైట్స్ ధర

కాగా, ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 14 కోట్ల వరకు ఖర్చు చేసిందని సమాచారం. అలాగే, ఈ సినిమా ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి ధర పలికినట్లు టాక్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More