బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా టైటిల్‌తో శర్వానంద్ న్యూ మూవీ- ఇద్దరు హీరోయిన్స్, సామజవరగమన డైరెక్టర్- సంక్రాంతి బరిలో!

నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా టైటిల్‌తో శర్వానంద్ కొత్త మూవీ రానుంది. అదే నారి నారి నడుమ మురారి. సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇద్దరు బ్యూటిపుల్స్ హీరోయిన్స్‌గా చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నారి నారి నడుమ మురారి సినిమా నిలవనుంది.

Published on: Dec 7, 2025, 21:23:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా 'నారి నారి నడుమ మురారి'. ఇదివరకే బైకర్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన శర్వానంద్ మరో మూవీతో రెడీ అయ్యాడు.

బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా టైటిల్‌తో శర్వానంద్ న్యూ మూవీ- ఇద్దరు హీరోయిన్స్, సామజవరగమన డైరెక్టర్- సంక్రాంతి బరిలో!
బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా టైటిల్‌తో శర్వానంద్ న్యూ మూవీ- ఇద్దరు హీరోయిన్స్, సామజవరగమన డైరెక్టర్- సంక్రాంతి బరిలో!

సామజజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యూ

నారి నారి నడుమ మురారి సినిమాకు సామజజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యూ చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు. ఇది ఫెస్టివల్‌కి పర్‌ఫెక్ట్ మూవీగా అభివర్ణించారు.

ఇద్దరు హీరోయిన్స్

అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నారి నారి నడుమ మురారి సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో విరూపాక్ష బ్యూటీ సంయుక్త మీనన్, ఏజెంట్ భామ సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటించారు.

బాలకృష్ణ సూపర్ హిట్ టైటిల్‌తో

బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ టైటిల్ నారి నారి నడుమ మురారితో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ ఎక్సయిటింగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.

బిగ్గెస్ట్ సీజన్

నారి నారి నడుమ మురారి 2026లో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇది తెలుగు సినిమా రిలీజెస్‌కి బిగ్గెస్ట్ సీజన్. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కావడంతో సంక్రాంతి నారి నారి నడుమ మురారి రిలీజ్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

సంక్రాంతి రికార్డ్

శర్వానంద్ ఈ సంక్రాంతి పండుగ సమయంలో స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు. శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాలు సంక్రాంతికి విడుదలై పెద్ద బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇదే జోరులో ఈ పండుగ సెలవులు చిత్రానికి గణనీయమైన ఉత్సాహాన్ని ఇస్తాయని టీమ్ నమ్మకంగా ఉంది.

నారి నారి నడుమ మురారి టెక్నిషియన్స్

ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, సినిమాటోగ్రఫీని జ్ఞాన శేఖర్ విఎస్, యువరాజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కథను భాను బోగవరపు రాశారు. నందు సావిరిగణ సంభాషణలు అందిస్తున్నారు.

నెక్ట్స్ ఫేజ్ ప్రమోషన్స్

ఆర్ట్ డైరెక్టర్‌గా బ్రహ్మ కడలి, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఈ ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్నారు. మరింత ఎక్సయిటింగ్ కంటెంట్‌ను, నెక్ట్స్ ఫేజ్ ప్రమోషన్స్‌ను త్వరలో ప్రారంభించడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది.

బైకర్ మూవీ గురించి

ఇక శర్వానంద్ హీరోగా చేసిన మరో సినిమా బైకర్. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా చేసింది. అభిలాష్ కంకర దర్శకత్వంలో తెలుగు బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామాగా బైకర్ తెరకెక్కింది. ఇందులో డా. రాజశేఖర్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More