సంక్రాంతికి ఈ రాశుల వారి జీవితమే మారిపోతుంది, శుక్రాదిత్య రాజయోగంతో బోలెడు లాభాలు.. డబ్బు, పెళ్ళి, ఉద్యోగాలతో పాటు ఎన్నో
గ్రహాలకు జీవితాలను మార్చే శక్తి ఉంటుంది. గ్రహ సంచారంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. శుక్రుడు ప్రేమ, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. 2026లో శుక్రుడి రాశి మార్పు శుక్రాదిత్య రాజయోగంను తీసుకురాబోతోంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అశుభ యోగాలు, శుభయోగాలు ఏర్పడటం చూస్తూ ఉంటాం. గ్రహాలకు జీవితాలను మార్చే శక్తి ఉంటుంది. గ్రహ సంచారంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. శుక్రుడు ప్రేమ, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. 2026లో శుక్రుడి రాశి మార్పు శుక్రాదిత్య రాజయోగంను తీసుకురాబోతోంది. రాక్షసులకి గురువైనటువంటి శుక్రుడు జనవరి 13న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

శుక్రాదిత్య రాజయోగం
ఆ తర్వాత రోజు అంటే జనవరి 14న గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటాము. మకర రాశికి అధిపతి శని. జనవరి 14న శుక్రాదిత్య రాజయోగం మకర రాశిలో ఏర్పడుతుంది.
ఈ రాజయోగం కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాబోతుంది. శుక్రాదిత్య రాజయోగం ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చేలా చేస్తుంది? ఏ రాశి వారు ఎక్కువ లాభాలను పొందుతారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారి జీవితంలో ఊహించని లాభాలు
సూర్యుడు, శుక్రుడు మకర రాశిలో సంయోగం చెందినప్పుడు ఏర్పడుతుంది. ఇది చాలా శుభప్రదమైనది. శుక్రుడు మకర రాశిలో ఫిబ్రవరి 6 వరకు ఉంటుంది. మొత్తం 22 రోజుల పాటు ఈ రాజయోగం కొనసాగుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. మరి అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. వృషభ రాశి వారు ఈ రాజయోగంతో కెరీర్‌లో, బిజినెస్‌లో బాగా రాణిస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. జీతాలు పెరగవచ్చు. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు వస్తాయి. పెళ్లి కాని వారు జీవిత భాగస్వామిని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగాల్లో పని చేసేవారు విజయాలు సాధిస్తారు.
2.మకర రాశి
మకర రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం అనేక విధాలుగా కలిసివస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కెరీర్‌లో, వ్యాపారంలో ఎక్కువ మార్పులు చూస్తారు. సంతోషం, ప్రశాంతత, డబ్బు లభిస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారు జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది.
3.తులా రాశి
తులా రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. మొత్తానికి ఈ యోగం ఈ రాశి వారికి అనేక విధాలుగా కలిసివస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


